ఈ బ్రీడ్‌ కుక్కలను పెంచుతున్నారా.?. తాజా అధ్యయనంలో షాకింగ్‌ నిజం..

-

కుక్కలను పెంచుకోవాలని ఈరోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. మూగజీవులపై ప్రేమ ఉండటంలో తప్పు లేదు. కానీ అది మన ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఉండకూడదు. కొంతమంది..కుక్కలమీద అతి ప్రేమతో..అది కుక్క అని కూడా మర్చిపోయి.. వాటిని తెగ ముద్దాడతారు. నిజానికి కుక్కనోటి నుంచి వచ్చే లాలాజలం చాలా ప్రమాదకరమైనది. ఇది మనుషులకు వివిధ జబ్బులకు కారణం అవుతుంది. డాక్టర్లైతే.. కొన్ని కుక్కలను అసలు పెంచుకోవద్దని చెబుతున్నారు. పొట్టిగా, బుజ్జిగా కనిపించే బుల్‌డాగ్‌లను కొనొద్దని పశువైద్యులు, జంతు ప్రేమికులు అంటున్నారు. కారణం ఏంటి.?

మిగతా కుక్కలతో పోల్చినప్పుడు ఈ బుల్‌డాగ్‌కు రోగాలు చుట్టుముట్టే ముప్పు రెండు రెట్లు ఎక్కువని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఈ బ్రీడ్‌లో మార్పులు చేయాల్సిన అవసరముందని, అప్పటివరకు వీటిని పెంచుకోకపోవడమే మంచిదని లండన్‌లోని రాయల్ వెటర్నరీ కాలేజీ నిపుణులు తెలిపారు. ఇంగ్లీష్ బుల్‌డాగ్‌లతోపాటు ఫ్రెంచ్ బుల్‌డాగ్, పగ్‌లను కూడా ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా చుట్టుముడుతున్నాయని పేర్కొన్నారు. అప్పటివరకు ఈ కుక్కలను కొనుగోలు చేయొద్దని, సోషల్ మీడియాలో వీటికి లైక్‌లు కొట్టడం, పోస్టులు పెట్టడం లాంటివి కూడా తగ్గించాలని తెలిపారు.

వీటి ముఖం బల్ల పరుపుగా ఉంటుంది. చర్మం అంతా ముడతలుముడతలుగా ఉండే ఈ బుల్‌డాగ్‌లు చాలా పొట్టిగా కనిపిస్తాయి. ఈ లక్షణాలే వీటిలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయట. ఈ శునకాల ఫోటోలను ఆన్‌లైన్ షేర్ చేయడం, లైక్‌లు కొట్టడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు మరింత మంది ఆసక్తి చూపించే అవకాశముంది కాబట్టి ఇలా చేయడం మానుకోమని నిపుణులు అంటున్నారు.

బుల్‌డాగ్‌ల బ్రీడింగ్‌పై కొన్ని దేశాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయని నిపుణులు చేస్తున్నారు. ఇప్పటికే ఆ కుక్కలను కొనుగోలు చేస్తే.. వాటి ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాటి శ్వాస తీసుకునే విధానం ఎలా ఉంది? చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయా? లాంటి అంశాలను పరిశీలించాలి. ఏదైనా అవసరమైతే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి”అని లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన అలిసన్ స్కిప్పర్ అన్నారు.

ఆకారం చూసి కుక్కలను కొనకూడదని… బ్రీడింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించే వారి దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేయడం ద్వారా కొంత వరకు ఈ సమస్యను పరిష్కరించొచ్చు”అని ద కెన్నెల్ క్లబ్ అధికార ప్రతినిధి బిల్ లాంబర్ట్ చెప్పారు. ఇతర శునకాలతో పోల్చినప్పుడు చర్మం ముడతల మధ్య ఇన్ఫెక్షలు (38 రెట్లు ఎక్కువ), కంటి సమస్యలు (26 రెట్లు ఎక్కువ), కింద దవడ జారిపోవడం (24 రెట్లు ఎక్కువ), శ్వాస సమస్యలు (19 రెట్లు ఎక్కువ) లాంటి అనారోగ్య సమస్యలు ఈ బుల్‌డాగ్‌లకు ఎక్కువగా వస్తున్నట్లు వెల్లడైంది. కాబట్టి.. జంతుప్రేమికులు ఈ విషయంపై కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version