ఐదు వేల సంవత్సరాల నాటి ఆకులు రాలని మహా వృక్షం..!

-

శ్రీ కృష్ణ పరమాత్మ దేవ లోకం నుండి తెచ్చి సత్యభామకు బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తర ప్రదేశ్ లో నీ బారబంకి జిల్లాలో కింటూర్ అనే గ్రామంలో ఉంది. ప్రపంచంలో కెల్లా అతి విలక్షణమైన వృక్షం గా దీనిని వర్ణిస్తారు శాస్త్రజ్ఞులు.ప్రపంచం లో ఏ వృక్షానికి లేని ప్రత్యేకత దీని సొంతం.

దీనికి ఏ విధమైన పండ్లు కాయవు. ఈ చెట్టు క్రింద భాగంలో ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. దీని పువ్వులు కూడా బంగారు ,తెలుపు రంగులో చూడగానే ఆకర్షిస్తాయి.ఇవి జూన్, జూలై మాసములలో పూస్తాయి. వీటి సువాసన చాలా దూరం వరకు వస్తుంది.

ఈ వృక్షం యొక్క వయస్సు 1000 నుంచి 5000 సంవత్సరాలు గా చెబుతారు.దీని చుట్టుకొలత 50 అడుగులు,ఎత్తు 45 అడుగులుగా చెప్ప బడుతుంది.ఈ వృక్షం యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దీని ఆకులు కానీ,కొమ్మలు కానీ ఎండిపోయి రాలవు.వాటంతట అవే కుచించుకుపోయి కాండంలో కలసిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news