అమెరికా అల్లుళ్ళు ఇంత సైకో గాళ్ళా…?

-

అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది అంటే చాలా మంది పొంగిపోతూ ఉంటారు, అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని భావించి అమెరికా సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమెరికాలో ఐటి ఉద్యోగి అంటే అదో రేంజ్ అన్నమాట. చాలా మంది అబ్బాయిల కల కూడా అదే. అమ్మాయిలూ అంతే ఆలోచిస్తున్నారు. మా వారు అమ్రేకా లో షాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు.

కాని అమెరికాలో చాలా మంది అల్లుళ్ళు సైకో గాళ్ళు అంటున్నాయి కొన్ని సర్వేలు. అమెరికా అల్లుళ్ల వేధింపులపై తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 574 కేసులు ఎన్నారై భర్తలు, వారి బంధువులపైన నమోదయ్యాయి. ఈ కేసుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన 17 మహిళా పోలీస్ స్టేషన్ల లోనే 417 కేసులు నమోదు కావడం గమనార్హం. గత సంవత్సరం జూలై 17 న ఏర్పాటైన ప్రత్యేక ఎన్నారై సెల్ కు 73 పిటీషన్ లు రాగా,

వివాహ, గృహ హింస, ఇతర వేధింపులపై ఎన్నారై నిందితులపై చర్యలు తీసుకోవాలని, వచ్చిన ఈ పిటీషన్లలో 70 వాటిపై కేసులను నమోదు చేసారు. ఈ 70 కేసుల్లో 29 కేసులు దార్యాప్తు దశలో ఉండగా, 41 కేసులు పెండింగ్ ట్రయల్స్ లోనే ఉన్నాయి. వారిలో 46 మందికి లుక్ అవుట్ నోటీసులు, మరో 32 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ లు జారీ చేసారు. ఐదుగురికి ఎల్.ఒ.సిలు అమలు చేసారు. మరో ఆరుగురి నుంచి పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

హైదరాబాద్ సిటీ మహిళా సీసీఎస్ పోలీసు స్టేషన్ లో అత్యధికంగా 137 కేసులుతో మొదటి స్థానంలో ఉంది. 78 కేసులతో సరూర్ నగర్ మహిళా పీ.ఎస్ ద్వితీయ స్థానంలో ఉండగా… సౌత్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో 65 , బేగంపేట్ మహిళా స్టేషన్ లో 34 ,భువనగిరి మహిళా స్టేషన్ లో ఒక కేసు, గచ్చిబౌలి మహిళా స్టేషన్ లో 8 కేసులు , వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని సుబేదారి, వరంగల్ అర్బన్ మహిళా స్టేషన్ లలో 42, ఖమ్మం లో ఏడు కేసులు మహబూబ్ నగర్ లో ఆరు కేసులు, ఆదిలాబాద్ లో 11 కేసులు, కరీంనగర్ మహిళా స్టేషన్ లో 21, నల్గొండ స్టేషన్ లో ఏడు కోసులు నమోదు చేసారు. కాబట్టి పిల్లను ఇచ్చే ముందు జాగ్రత్త.

Read more RELATED
Recommended to you

Latest news