లిప్ లాక్ ఇలా ఇస్తే కరోనా రాదూ…!

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధి దెబ్బకు అందరూ ఇప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. వైరస్ కారణంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులపై అధికారులు నిఘా పెడుతున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనుమానం ఉంటే ఆస్పత్రికి రావాలని చెప్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అనుమానిత ప్రయాణికులను విమానాలు కూడా ఎక్కనివ్వడం లేదు పలు దేశాల అధికారులు. భారత్, అమెరికా, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మలేషియా, చైనా, తైవాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా,జపాన్, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మని, బ్రెజిల్ ఇలా అన్ని దేశాలు కూడా ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది.

వాలంటైన్స్ డే ఈ నెల 14 న ఉన్న నేపధ్యంలో అమ్మాయి, అబ్బాయి లిప్ లాక్ ఇవ్వాలి అంటే మాస్క్ లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా లిప్ లాక్ ఇస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఒక జంట మాస్క్ పెట్టుకుని లిప్ లాక్ ఇస్తుంది. మీకు కరోనా రాకుండా ఉండాలంటే ఇలా లిప్ లాక్ ఇవ్వాలని సూచిస్తున్నారు. మీరు కూడా జాగ్రత్తపడితే బెస్ట్ ఏమో చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version