వామ్మో తల్లి..ఆ ఊపేంటి..ఆ తిప్పుడేంటి..వీడియో..

-

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అందులో డ్యాన్స్ కు సంబందించిన వీడియోలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..కొన్ని ఫన్నీగా కడుపుబ్బా నవ్విస్తే మరి కొన్ని మాత్రం షాక్ కు గురి చేస్తున్నాయి..అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది..ఓ యువతి డ్యాన్స్ వీడియో చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

విషయానికొస్తే.. భోజ్‌పురి సాంగ్‌ ‘పత్లి కమారియా మోరీ’ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాట మీద ఎంతోమంది డాన్స్‌ చేస్తూ రీల్స్‌ చేశారు.దాంతో ఈ సాంగ్‌ మరింత పాపులర్‌ అయిపోయింది. చిన్న,పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పలు వేశారు. అయితే ఇలాంటి డాన్స్‌ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ భోజ్‌పురి పాటకు ఓ యువతి చేసిన డాన్స్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి చాలా లావుగా ఉంది.

అంత భారీ శరీరంతో డాన్స్‌ చేయడం కాదుకదా… అడుగుతీసి అడుగు వేయడమే కష్టం. అలాంటిది ఆ యువతి అంత భారీ శరీరం తో ఉన్నా కూడా చాలా సింపుల్ గా డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది.. నడుమును బెల్లి డ్యాన్స్ రేంజ్ లో ఊపుతూ.. ఫ్లోర్‌ మూమెంట్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఆ యువతిని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే లక్షల్లో వ్యుస్ ను అందుకుంది..ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

https://www.instagram.com/reel/CmeSYp7DNHd/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Exit mobile version