జీన్స్‌ను ఐరన్‌ చేయొచ్చా..? ఎక్స్‌పర్ట్స్‌ ఏం అంటున్నారు..?

-

ఈరోజుల్లో అందరూ కామన్‌గా వేసుకునే దుస్తుల్లో జీన్స్‌ పక్కా ఉంటుంది. ఒక్కోక్కరికి కనీసం పది రకాల జీన్సులు అయినా ఉంటాయి. అసలు జీన్స్‌ను మించిన కంఫర్ట్‌ ఇంకోటి ఉండదు అని చాలా మందీ ఫీల్‌ అవుతారు. అయితే జీన్స్‌ను ఎలా చూసుకోవాలో చాలా మందికి తెలియదు. దీని వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. జీన్స్‌ను మాములు బట్టల్లా ఒక్కసారి వేసుకోగానే ఉతికేస్తుంటారు.. ఇస్త్రీ చేస్తుంటారు. అసలు జీన్స్‌ను ఇస్త్రీ చేయడం కరెక్టేనా..?

jeans

జీన్స్‌ను ఇస్త్రీ చేయాలా వద్దా…? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. మీరు మీ జీన్స్ లోపల ఉన్న లేబుల్‌లను చదివితే, మీరు ఈ పొరపాటు చేయలేరు. అలాగే జీన్స్‌ను రెగ్యులర్‌గా ఉతకడం వల్ల వాటి మెరుపు తగ్గుతుంది. అంతే కాకుండా, అది తన బలాన్ని కోల్పోతుంది. త్వరలో చిరిగిపోతుంది. కనీసం 5 లేదా 6 లేదా అంతకంటే ఎక్కువ ధరించిన తర్వాతనే మీరు జీన్స్‌ను ఉతకాలి. జీన్స్ మురికిగా అనిపిస్తే, ఫాబ్రిక్ స్ప్రేని ఉపయోగించండి. కానీ వాటిని క్రమం తప్పకుండా ఉతకవద్దు.

కొందరికి వేడి నీళ్లలో బట్టలు ఉతకడం కూడా అలవాటు. అయితే, జీన్స్‌తో ఈ తప్పు చేయవద్దు. జీన్స్‌ను ఎల్లప్పుడూ చల్లటి లేదా సాధారణ నీటిలో మాత్రమే ఉతకాలి. అందువలన దాని స్థితిస్థాపకత అలాగే ఉంటుంది. అలాగే, వేడి నీటిలో కడగవద్దు లేదా ప్రత్యక్ష సూర్యకాంతిలో ఆరబెట్టవద్దు, ఎందుకంటే జీన్స్‌ కలర్‌ షేడ్‌ అవుతుంది.

అదేవిధంగా, మీరు మీ జీన్స్‌ను వాషింగ్ మెషీన్‌లో ఉతికినప్పుడు, జీన్స్‌ను తిరగల తీసి ఉతకండి.. అందువల్ల వాటి రంగు త్వరగా పోదు. జీన్స్‌ వేసుకోవడమే కాదు.. దాన్ని ఎలా మెయింటేన్‌ చేయాలో కూడా తెలిసి ఉండాలి. అలాగే జీన్స్‌ కొనేప్పుడు ఖరీదైనవే తీసుకోవాలి.. 400-500కు వచ్చే జీన్స్‌ తీసుకోవడం వల్ల అవి త్వరగా పాడవుతాయి, అవి మీకు అందాన్ని కూడా ఇవ్వవు.. ఒక్కసారి జీన్స్‌ కొంటే ఈజీగా మూడేళ్లు పైనే వాడొచ్చు.. కాబట్టి ఖరీదైన జీన్సులనే ఎంచుకోండి.!

Read more RELATED
Recommended to you

Latest news