లీటరు పెట్రోల్‌ అమ్మితే.. రూ.65 లాభం!

-

పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరల వల్ల సామాన్యులపై ఎలా ఉందో కానీ, ఈ పెరిగిన పెట్రోల్‌ అమ్మితే లేదంటే డీజిల్‌ విక్రయిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎంత రాబడి వస్తుందో మీకు తెలుసా? ఒక లీటరుపై రూ.32 –33 వరకు మిగులుతుంది. అంటే ఒక లీటరు పెట్రోల్, ఒక లీటరు డీజిల్‌ అమ్మితే రూ.రూ.65 మిగిలినట్లు.

పెట్రోల్, డీజిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రేట్లు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. పెట్రోల్‌ సెంచరీ కొట్టేందుకు రెడీగా ఉంది. డీజిల్‌ ధరలు అదే బాటలో రూ.90 దాటేసింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ అమ్మకం ద్వారా భారీగానే అర్జిస్తోంది. లీటరు పెట్రోల్‌పై రూ.33, లీటరు డీజిల్‌పై రూ.32 గడిస్తోంది. ఇది ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్, సర్‌ చార్జీ రూపంలో ఈ డబ్బులు పొందుతోంది.

మరోవైపు దేశీ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశీ ఇంధన ధరలు నిలకడగానే ఉండటం ఇది వరుసగా 18వ రోజు కావడం గమనార్హం. దీంతో హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్‌ ధర రూ.94.79 , డీజిల్‌ ధర రూ.88.86 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్‌ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.97.38 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.90.90 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.96.95 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.90.50 వద్ద నిలకడగా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.91.17 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్‌ ధర రూ.81.47 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ముంబయిలో కూడా ధరలు ఇంచుమించు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.97.57 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్‌ ధర రూ.88.60 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్‌) ధరలు పెరిగాయి. బ్యారెల్‌కు 0.03 శాతం పెరుగుదలతో 68.40 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.04 శాతం పెరుగుదలతో 64.84 డాలర్లకు చేరింది.

సాధారణంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగవచ్చు. మరో రోజు తగ్గనూవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. ఈ మారుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్న విషయం వాస్తవమే. కేంద్రానికి పన్నులు రూపేణా వచ్చే లాభం కోట్లలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news