సివిల్స్‌ ఇంటర్వూ ప్రశ్న: చెవులు, కళ్లు, నోరు లేని అమ్మాయిని ముట్టుకోకుండా ఎలా ప్రపోజ్‌ చేస్తావు..?

-

సివిల్స్‌కు ప్రీపెరయ్యే వాళ్లకు కేవలం సబ్జెట్‌ నాలెడ్జ్‌ ఉంటే సరిపోదు. లాజికల్‌ థింకింగ్‌ కూడా ఉంటాలి. మీరు వినే ఉంటారు.. సివిల్స్‌ ఇంటర్వూలలో.. చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని. దానికి చెప్పే సమాధానం బట్టే.. మీ థింకింగ్‌ కపాసిటీని అంచనా వేస్తారు. పర్సనాలిటీ, సమయస్ఫూర్తి వంటి వాటిపై కూడా ప్రశ్నలు అడుగుతారు. అటువంటి సివిల్స్ ఇంటర్వ్యూకి వచ్చిన ఒక యువకుడిని అడిగిన ప్రశ్న ఐఏఎస్‌లో అడిగిన టాప్ ప్రశ్నలలో ఒకటిగా నిలిచింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక కావడానికి మూడు పరీక్షలను ఎదుర్కోవాలి. వాటిలో ప్రిలిమ్స్, మెయిన్స్ అభ్యర్థుల అకడమిక్, జనరల్ అవేర్‌నెస్‌ను, విభిన్న అంశాలను పరీక్షించడం కోసం నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను సివిల్ సర్వీసెస్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం, స్వభావానికి సంబంధించిన పరీక్ష అని చెప్పవచ్చు. సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు తర్కంతో ఆలోచిస్తే తప్ప జవాబులు చెప్పలేము. ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఈ క్రమంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక యువకుడిని అడిగిన ప్రశ్న టాప్ ఐఏఎస్ ప్రశ్నల్లో ఒకటిగా నిలిచింది. అదేంటంటే..

నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆమెకు చెవులు, కళ్ళు, నోరు పనిచేయవు. ఆమెను తాకకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు? అని అడిగారు. ఇది లాజిక్ ప్రశ్న. ఆన్సర్‌ చదవకుండా.. మీరు ఆలోచించండి.. ఎలా ప్రపోస్‌ చేస్తారు..? ఆన్సర్‌ తట్టిందా..? లేదా.. అయితే వినండి.. ఆ యువకుడు ఏం చెప్పాడో..!!

ఆ ప్రశ్నకి సమాధానం, ఆ అబ్బాయి అంధుడు, చెవిటివాడు, మూగవాడు కాదు కాబట్టి ప్రపోజ్ చేయగలడు. అయితే అతని ప్రతిపాదనను అమ్మాయి అర్థం చేసుకోవాలని చెప్పలేదు కదా.. అని ఆ యువకుడు చెప్పాడు. అవును అది నిజమే కదా..!

Read more RELATED
Recommended to you

Latest news