చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని 150 పేజీల కౌంటర్ దాఖలు..!

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది. సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశముంది. ఇప్పటికే సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని.. 150 పేజీల కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. దర్యాప్తు వివరాలను సేకరించిన ఆధారాలను కౌంటర్ లో సీఐడీ పొందుపరిచింది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకి ఎందుకు వర్తించదనే అంశాన్ని పిటిషన్ లో సీఐడీ పొందుపరిచింది. చంద్రబాబు పై ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కి సెక్షన్ 409 వర్తిస్తుందని కౌంటర్ లో వివరించింది.

చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ.. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కస్టడీకి సంబంధించిన విచారణ ముగిసింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టారు. దాదాపు మొత్తం 7 గంటల పాటు విచారణ చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తరువాత ఆయనకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. విచారణను సీఐడీకి చెందిన వీడియో గ్రాఫర్ తో మాత్రమే రికార్డు చేయించాలని.. ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు చెప్పినట్టుగానే ఇవాళ చంద్రబాబును సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. రేపు మరోసారి విచారణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news