ఆకాశం నుంచి వచ్చి.. నిండు మనిషి ప్రాణం తీసిన జాతీయ పక్షి..!

-

భూమిపైన పుట్టిన వారు అందరూ ఇక్కడే ఉంటారనుకోవడం పొరపాటేనని పెద్దలు, పండితులు చెప్తుంటారు. వారు చెప్పేది నిజమే. ప్రతీ ఒక్కరు మరణం ముందు తలొంచాల్సిందే. అయితే, ఎలా ? ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో మరణం సంభవిస్తుందనేది చెప్పడం మానవుడి వల్ల కాదు. కాగా, అనుకోని సందర్భాల్లో విచిత్రంగా ఉన్నట్లుండి మరణించే వారిని మనం చూడొచ్చు. కాగా, విచిత్రంగా మిస్టరీగా మిగిలిపోయే మరణాలూ ఉంటాయి. ఆ కోవకు చెందినది ఇప్పుడు మనం తెలుసుకోబోయే వార్త. ఈ విషాద ఘటనలో జాతీయ పక్షి నెమలి వ్యక్తి మరణానికి కారణమైంది.

కర్నాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన అబ్దుల్లా మొబైల్ షాప్‌లో పని చేస్తూ జీవనం సాగించేవాడు. చాలా హ్యాపీగా లైఫ్ కొనసాగుతున్న క్రమంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..ఇటీవల మొబైల్ షాప్‌లో రోజువారీగా పనులు చేసుకున్న తర్వాత అతడు పని నిమిత్తం దగ్గర్లోని వేరే ప్రాంతానికి తన స్కూటీపై వెళ్లాడు. వర్క్స్ ముగించుకుని ఇంటికి తిరిగొస్తున్న క్రమంలోనే నెమలి రూపంలో అతడిని మృత్యువు వెంటాడి కబళించింది.

నేషనల్ హైవేపై మొబైల్ షాపునకు తిరిగి వస్తున్న క్రమంలో స్కూటీపై‌నున్న అబ్దుల్లాపై జాతీయ పక్షి నెమలి ఎగురుకుంటూ వచ్చి పడింది. ఫలితంగా స్కూటీ బ్యాలెన్స్ తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పుదుబిద్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, పికాక్స్ నేషనల్ హైవేపై ఫ్రీగా తిరుగుతుండటం వల్ల ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు అంటున్నారు. పికాక్స్‌పై తగు చర్యలు అటవీ శాఖ అధికారులను వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. పంట పొలాల్లోనూ పికాక్స్ తిరుగుతున్నాయని, తద్వారా పంటలకూ నష్టం వాటిల్లుతున్నదని రైతులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news