మలబద్ధకం సమస్యా.. వెలక్కాయను వాడండి చాలు..!!

-

మలబద్ధకం అనేది చిన్న సమస్య ఏం కాదు.. దీనివల్ల క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజుల్లో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల ఆకలి ఉండదు, సరైన నిద్ర ఉండదు. వెన్ను నొప్పి ఉంటుంది. జంక్ ఫుడ్ వినియోగం, ఆల్కహాల్ తాగడం, అతిగా తినడం, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోవడం, తగినంత నీరు తీసుకోకపోవడం, అధికంగా మాంసం తినడం వంటి వాటి వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. వీటితో పాటు ధూమపానం, వ్యాయామం లేకపోవడం కూడా పొట్టలో సమస్య పెరిగేలా చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పెద్దగా ఎలాంటి చికిత్స లేదు. ఆహారపు అలవాట్లు మార్చాలి. కొన్ని చిట్కాలు పాటించాలి.. ఆయుర్వేదం ప్రకారం మలబద్ధకం తగ్గించుకునే చిట్కాలు ఇవే..! వీటితో రిజల్ట్‌ కచ్చితంగా ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం వాత దోషాన్ని సమతుల్యం చేసుకోవడం కోసం తాజాగా వండిన మెత్తని ఆహారాలు తీసుకోవాలి. ఈ ఆహారాల్లో ప్రోటీన్, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చల్లని ఆహారాలు, పానియాలకు దూరంగా ఉండాలి. బాగా ఉడికించిన కూరగాయలను తినాలి.

ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వేయించిన లేదా పొడి చేసిన సోంపు గింజలు కలపాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

వెలగక్కాయని బేల్ పండు అంటారు. ఇది మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. సాయంత్రం భోజనానికి ముందు అరకప్పు బేల్ పండు గుజ్జు, ఒక టీ స్పూన్ బెల్లం కలిపి తినాలి. బేల్ రసంలో కొద్దిగా చింతపండు నీళ్ళు, బెల్లం కలిపి షర్బత్ లాగా కూడా చేసుకుని తీసుకోవచ్చు. డయాబెటిక్ బాధితులైతే ఈ పండు తినే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. ఇది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే కడుపుని మరింత ఇబ్బంది పెడుతుంది.

ఆయుర్వేద మూలిక లిక్కోరైస్ రూట్ కూడా జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఈ రూట్ పొడి వేసుకుని ఒక టీ స్పూన్ బెల్లం కలిపి తాగొచ్చు. దీన్ని తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది.

మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగించే అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాల్లో త్రిఫల చూర్ణం ఒకటి. వేడి నీటిలో దీన్ని కలుపుకుని త్రిఫల టీని తయారుచేసుకోవచ్చు. అర టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ యాలకులు పొడి చేసుకుని త్రిఫల చూర్ణంతో పాటు ఒక గ్లాసు నీటిలో కలుపుకుని కూడా తాగొచ్చు. దీనివల్ల పేగు కదలికలు బాగుండేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version