ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటున్నారా? ఐతే ఇది మీకోసమే..

-

అతి సర్వత్రా వర్జయేత్ర్ అంటారు. ఏదైనా సరే అతిగా చేయరాదని చెబుతుంటారు. మితంలోనే హితం ఉందని అంటారు. అవన్నీ ఉత్తమాటలు కావు. ఏదైనా సరే అతిగా చేయడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఆహారం కూడా మితంగానే తినాలి. మితంగా తింటే ఆహారం. అతిగా తింటే విషం అన్న సామెత ప్రతీ దానికీ వర్తిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దానిలో ఉండే ఆసిడ్స్ శరీరానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి. ఐతే అదే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.

కాలేయానికి మంచిది కాదు

మన శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన భాగం. రక్తాన్ని శుద్ధి పరచడంలో, శరీరం నుండి అమోనియాని బయటకి పంపించడంలో కీలక పాత్ర వహిస్తుంది. వెల్లుల్లి అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు సక్రమంగా జరగదు. దానివల్ల శరీరానికి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.

డయేరియా

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల డయేరియా రావచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ వల్ల డయేరియా తొందరగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వాంతులయ్యే అవకాశం చాలా ఎక్కువ.

చెడు వాసన

వెల్లుల్లి ఎక్కువగా తింటే అది నోటి దుర్వాసనకి దారితీస్తుంది. అందులో ఉండే సల్ఫ్జర్ నోటి దుర్వాసనకి కారణం అవుతుంది.

వెల్లుల్లి వల్ల రక్తం పలుచగా మారుతుంది. అందువల్ల ఎక్కువగా తీసుకుంటే తిప్పలు తప్పవు. గాయాలైనపుడు రక్తం గడ్డకుండా కారిపోతునే ఉంటుంది. వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే రక్తం అలా కారిపోతూనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version