అభిమాని క‌లవాల‌ని గ్రౌండ్‌లోకి వ‌స్తే.. ధోనీ ప‌రిగెత్తాడు.. త‌రువాత ఏమైందంటే..? వీడియో..!

-

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభ‌మ‌వుతుండ‌గా, ఇండియ‌న్ ప్లేయ‌ర్లంతా గ్రౌండ్‌లోకి చేరుకున్నారు. వారిలో ధోనీ వ‌ద్ద‌కు ఓ అభిమాని వేగంగా ప‌రిగెత్తుతూ వ‌చ్చాడు.

భార‌త క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ బ‌య‌టే కాదు, మైదానంలోనూ చాలా కూల్ గా ఉంటాడ‌నే విష‌యం అందరికీ తెలిసిందే. త‌న ఆట తీరుతో, ప్ర‌వ‌ర్త‌న‌తో ధోనీ ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికీ మన దేశంలో ఏ గ్రౌండ్ లో నైనా స‌రే టీమిండియా ఆడుతుందంటే చాలు.. జ‌ట్టులో ధోనీ ఉంటే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకుంటుంటారు. ఇక కొంద‌రు అభిమానులైతే మైదానంలో ఆడుతున్న ధోనీ వ‌ద్ద‌కు వ‌చ్చి అత‌నికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డ‌మో, కౌగిలించుకోవ‌డ‌మో, అత‌ని పాదాల‌ను తాక‌డ‌మో చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ధోనీ త‌న ఫ్యాన్స్‌ను ప్రేమ‌తో ద‌గ్గ‌ర‌కు తీసుకుంటాడు.

అయితే తాజాగా జ‌రిగిన ఆస్ట్రేలియా, ఇండియా రెండో వ‌న్డే మ్యాచ్‌లోనూ ధోనీ వ‌ద్ద‌కు ఓ అభిమాని వ‌చ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభ‌మ‌వుతుండ‌గా, ఇండియ‌న్ ప్లేయ‌ర్లంతా గ్రౌండ్‌లోకి చేరుకున్నారు. వారిలో ధోనీ వ‌ద్ద‌కు ఓ అభిమాని వేగంగా ప‌రిగెత్తుతూ వ‌చ్చాడు. అయితే అత‌న్ని చూసిన ధోనీ తాను కూడా అతనికి దొర‌క్కుండా కొంత దూరం ప‌రిగెత్తాడు. ఆ త‌రువాత ధోనీ ఆగాడు. దీంతో ఆ అభిమాని ధోనీ వ‌ద్ద‌కు వెళ్లి ధోనీని కౌగిలించుకుని ఆ త‌రువాత అత‌ని పాదాల‌ను తాకి వెళ్లిపోయాడు.

కాగా ఇలా ఆ అభిమానిని ధోనీ ఆట‌పట్టించిన ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంద‌రూ ధోనీలో ఉన్న హ్యూమ‌ర్ యాంగిల్‌కు ఫిదా అవుతున్నారు. ధోనీ త‌న అభిమానుల‌ను ఇలా చూసుకుంటాడంటూ.. కొంద‌రు ట్విట్ట‌ర్‌లో కామెంట్లు పెడుతున్నారు. ధోనీ నిజంగా చాలా కూల్ ప‌ర్స‌న్‌.. అంటూ కొంద‌రు కితాబిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version