మ్యూఛువల్ ఫండ్స్ లో గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయా?

-

మ్యూఛువల్ ఫండ్స్ అనగానే చాలా మందికి స్టాక్ మార్కెట్ గుర్తుకు వస్తుంది. స్టాక్ మార్కెట్ అనగానే భయం పుడుతుంది. అవసరమా అన్న ఆలోచన వస్తుంది. కానీ మ్యూఛువల్ ఫండ్స్ వేరు స్టాక్ మార్కెట్ వేరు అన్న మాట అడ్వైజర్ చెప్పినపుడు, ఇందులో డబ్బులకి గ్యారంటీ ఉంటుందా అని అడుగుతారు. దానికి అడ్వైజర్ రకరకాల సమాధానాలు చెప్పవచ్చు. ఎక్కువ రోజులు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయని, ఫలానా ఫండ్లలో లాభాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ, నిజానికి మ్యూచువల్ ఫండ్లలో నిజంగా గ్యారంటీ ఉంటుందా అన్న దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం.mutual funds

మ్యూఛువల్ ఫండ్ల గురింకీ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా అక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్లు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా చదవండి అని. అంటే దానర్థం మ్యూఛువల్ ఫండ్లలో పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదనే. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి గ్యారంటీ ఇవ్వలేరు. ఎప్పుడు ఏ స్టాక్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఎక్కువ రోజులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయంటారే తప్ప గ్యారంటీ అన్న మాట ఎత్తరు.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని అనుకునే వారు స్కీము వివరాలు, ఆదేలాంటి స్కీము, ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు వంటి వివరాలు తెలుసుకోవాలి. ఫండ్ మేనేజర్ ఎవరు అన్న సంగతి తెలిసి ఉండాలి. అప్పుడు మీ పెట్టుబడి మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది.

గమనిక: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్లు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా చదవండి

Read more RELATED
Recommended to you

Latest news