ఫ్రిడ్జ్ లో మనం పాడైపోకుండా చాలా వస్తువుల్ని పెడుతూ ఉంటాం. దాని వలన ఫ్రిజ్లో పెట్టిన ఆహార పదార్థాలు త్వరగా పాడైపోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ పైన మాత్రం కొన్ని వస్తువులని అస్సలు పెట్టకూడదు. దాని వలన చాలా నష్టం ఉంటుంది. ఫ్రిడ్జ్ పైన ఎలాంటి వాటిని ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో మొక్కల్ని పెంచుతున్నారు. ఫ్యాషన్ కి అందానికి ఉపయోగించడానికి ఏ ప్లేస్ ఉన్నా కూడా ఇండోర్ ప్లాంట్స్ ని పెడుతున్నారు. చూడడానికి అందంగా కనబడతాయి.
ఫ్రిడ్జ్ పైన కూడా మొక్కలను చాలా మంది పెడుతూ ఉంటారు. కానీ ఇలా ఫ్రిడ్జ్ పైన మొక్కలు పెట్టకూడదు. ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్ కూడా పాడైపోతుందట. అలాగే చేపల తొట్టెను కూడా పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన చేపలు త్వరగా చనిపోతాయట. అలాగే మందులు వంటి వాటిని పెట్టకూడదు. ఫ్రిడ్జ్ పైన మందులు పెట్టడం వలన ఫ్రిడ్జ్ వేడికి మందులు పవర్ తగ్గిపోతుంది.
కొన్ని రకాల మందులు అయితే పాడైపోతాయి. అలాగే చాలా మంది ఫ్రిడ్జ్ పైన ఉండే కవర్స్ సైడ్ లో డబ్బులు పెడతారు. అవసరానికి డబ్బులు త్వరగా దొరుకుతాయని ఇలా చేస్తారు కానీ ఇలా ఉంచడం మంచిది కాదు. వాస్తు ప్రకారం డబ్బులను ఇలా పెట్టడం వలన ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఇక మీదట ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి లేదంటే ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి.