కొండా సురేఖ పరువు తీశారు టాలీవుడ్ నటి, మాజీ మంత్రి రోజా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రోజా.. మండిపడ్డారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై, సమంతపై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ప్రకటించారు రోజా.
కొండా సురేఖపై గులాబీ పార్టీ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురైన కొండా సురేఖ అంత కన్నాహేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేసేందుకు మనస్సు ఎలా అంగీకరించింది? అని ఆగ్రహించారు రోజా.
మీకు, మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోందని చెప్పారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితిని నాగార్జున కుటుంబం, సమంత మనో ధైర్యంతో అధిగమిస్తారని ఆశిస్తున్నానని వివరించారు ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా.