ఫ్రిడ్జ్ మీద వీటిని అస్సలు పెట్టకండి..!

-

ఫ్రిజ్లో మనం ఆహారపదార్థాలని పెట్టుకుంటూ ఉంటాము. అలానే కూరలు పాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటాము అయితే ఫ్రిడ్జ్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ మీద కొన్ని వస్తువులు పెట్టడం వలన మనకి ఇబ్బంది కలుగుతుంది ఫ్రిజ్ ని పెట్టేటప్పుడు కూడా పద్ధతి ఉంది. ఫ్రిడ్జ్ ని పెట్టేటప్పుడు గోడకి తగిలేలా ఫ్రిడ్జ్ ని పెట్టకూడదు ఫ్రిజ్ కి గోడకి కనీసం ఒక అడుగు దూరం గ్యాప్ ఉండాలి. ఫ్రిజ్ ని పెట్టుకునేటప్పుడు పశ్చిమ వైపు పెట్టుకుంటే మంచిది.

 

లేదంటే నైరుతి వైపైనా పెట్టుకోవచ్చు అప్పుడు ఆనందం ఉంటుంది అని పండితులు అంటున్నారు లేకపోతే ఇబ్బందులు కలుగుతాయట. ఫ్రిజ్ మీద కొందరు డబ్బులు బంగారం వంటివి పెడతారు ఆ తప్పు చేయకూడదు దాని వలన నష్టం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ఫ్రిడ్జ్ మీద ఎప్పుడు బహుమతులు వంటివి పెట్టకూడదు కొంతమంది పిల్లలు గెలుపొందిన బహుమతుల్ని ఫ్రిడ్జ్ మీద పేరుస్తూ ఉంటారు.

అలా పెట్టకూడదు. అలా చేయడం వలన పిల్లలు భవిష్యత్తులో పైకి రాలేరట మందులు వంటి వాటిని కూడా ఫ్రిజ్ మీద పెట్టకూడదు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి చాలామందికి ఈ విషయాలు తెలియవు. కానీ ఇలా ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది లేదంటే అనవసరంగా మీకే తెలియకుండా సమస్యల్లో కూరుకు పోవాల్సి ఉంటుంది. ఈసారి ఈ విషయాన్ని కచ్చితంగా ఆచరించి ఏ బాధ లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news