విటమిన్ డి మనిషికి ఎంత అవసరమో అందరికీ తెలుసు.. ఇది లోపిస్తే.. ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా ఈమధ్య బానే అవగాహన కల్పిస్తున్నారు. ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం విటమిన్ డీతోనే వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో కాల్షియం లోపిస్తుందో.. ఎముకల గుల్లబారిపోతాయి. విటిమిన్ డీని ఆహారం ద్వారా టాబ్లెట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు.. బాడీలో మరీ తక్కువగా విటిమిన్ డీ లోపం ఉంటే.. కచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే.. అయితే ఎలా పడితే అలా ఈ ట్యాబ్లెట్లు వాడితే.. ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది.. విటమిన్ల ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన మేరకు వాడాలి. అది కూడా కొంత కాలం పాటు మాత్రమే వాడాలి. మోతాదుకు మించి వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మనకు అందుబాటులో ఉన్న విటమిన్ ట్యాబ్లెట్లలో బి కాంప్లెక్స్‌తోపాటు విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె కూడా ఉన్నాయి. వీటిని కాంబినేషన్లలో విక్రయిస్తారు. లేదా విడి ట్యాబ్లెట్లు కూడా లభిస్తున్నాయి. అయితే విటమిన్ డి ట్యాబ్లెట్లను సాధారణంగా విడిగానే విక్రయిస్తారు. వేరే విటమిన్ల కాంబినేషన్‌లతో విక్రయించరు. ఈ క్రమంలోనే వీటిని చాలా మంది తెచ్చుకుని వేసుకుంటారు…డాక్టర్ చెప్పకపోయినా విటమిన్ డి ట్యాబ్లెట్లను రోజూ మింగుతుంటారు… కానీ ఇలా విటమిన్ డి ట్యాబ్లెట్లను మింగడం వల్ల తీవ్ర అనర్థాలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ డి ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీలు చెడిపోతాయని అంటున్నారు నిపుణులు…
విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు వారానికి 60వేల యూనిట్ల కెపాసిటీ ఉండే ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. విటమిన్ డి ని రోజువారీగా వాడాల్సి వస్తే.. గరిష్టంగా 2000 యూనిట్ల కెపాసిటీ ఉన్న ట్యాబ్లెట్ చాలు. ఇవి కూడా లోపం ఉంటేనే వాడాలి. కానీ కొందరు వీటిని అతిగా వాడుతున్నారు. దీంతో విటమిన్ డి శరీరంలో ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. శరీరంలోని కొవ్వులో కరిగి నిల్వ ఉంటుంది. మనం విటమిన్ డి ట్యాబ్లెట్లను మోతాదుకు మించి వేసుకుంటే.. మన శరీరంలోని కొవ్వులో ఆ విటమిన్ అధికంగా చేరుతుంది. అందులో నుంచి శరీరం తనకు కావల్సినంత వాడుకున్నా ఇంకా ఎక్కువగానే మిగిలిపోతుంది. ఇది బయటకు వెళ్లదు. దీంతో శరీరంలో కాల్షియం పెరిగిపోతుంది. శరీరంలో కాల్షియం పెరిగితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. దీంతో కిడ్నీలు చెడిపోతాయి.
డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఫలితంగా కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం. విటమిన్ డి ట్యాబ్లెట్లను అధికంగా ఎంత ప్రమాదమో తెలిసింది కదా.. వాటిని వాడే విషయంలో జాగ్రత్తలు అవసరం. డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడండి.. మీకు మీరే సొంత వైద్యం చేసుకుని ఆరోగ్యాన్ని ఆగం చేసుకోకంకడి.