IPL 2023: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం.

-

 

ఐపీఎల్ 2023 లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ముంబై ఛేదించింది. ముంబై బ్యాటర్‌లో.. ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ (30), డేవిడ్ (24) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్‌‌లో సుయాశ్ శర్మ 2, వరుణ్ చక్రవర్తి, శార్దూల్, పెర్గ్యూసన్ తలో వికెట్ తీశారు.

 

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(104; 51బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగాడు. రహ్మానుల్లా గుర్బాజ్(8), ఎన్ జ‌గ‌దీశ‌న్‌(0), నితీశ్ రాణా(5) రింకూ సింగ్‌(18)లు విఫ‌లం అయ్యారు. ఆఖ‌ర్లో ఆండ్రూ ర‌స్సెల్(21; 11బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌) వేగంగా ప‌రుగులు చేయ‌డంతో ముంబై ముందు ఓ మోస్తారు ల‌క్ష్యం నిలిచింది. ముంబై బౌల‌ర్ల‌లో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీయ‌గా, చావ్లా, జాన్సెన్, కామెరూన్ గ్రీన్‌, రిలే మెరెడిత్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version