ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ లో ఫోన్ కి ఛార్జింగ్ పెడితే ఎన్ని నష్టాలో తెలుసా..?

-

మొబైల్ ఫోన్ లేకుండా అడుగు బయట పెట్టడమే కష్టం. మొబైల్ లేకపోతే పనులు కూడా అవ్వవు. నిజంగా అవి మన జీవితం లో చాలా ముఖ్యమైనవిగా మారిపోయాయి. చాలా మంది ప్రయాణం చేసే సమయంలో రైళ్లలో, మెట్రో రైళ్లలో వంటి వాటిలో మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు.

అయితే ట్రైన్స్ లో మరియు మెట్రో ట్రైన్స్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఈ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మరి రైళ్లల్లో మరియు మెట్రో రైళ్లలో మొబైల్ కి ఛార్జింగ్ పెడితే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని దాని గురించి ఇప్పుడు చూద్దాం.

మెట్రో ట్రైన్స్ లో ఉండే చార్జింగ్ సాకెట్ లలో మొబైల్ కి ఛార్జింగ్ పెడితే కొన్ని నష్టాలు తప్పవట. మెట్రో లో, ట్రైన్స్ లో ఫోన్ కి ఛార్జింగ్ పెడితే మన యొక్క సెల్ ఫోన్ డ్యామేజ్ అవుతుందని నిపుణులు చెప్పడం జరిగింది. అలానే ఇలా ఛార్జ్ పెట్టడం వల్ల ఫోన్స్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ట్రైన్స్, మెట్రో లలో యుఎస్బి కనెక్టర్ తో ఛార్జ్ చేస్తూ ఉంటాం.

ఇలా చేస్తే మొబైల్ డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది. అలాగే వాటి యొక్క కరెంటు సామర్ధ్యం వల్ల ఫోన్ లో బ్యాటరీ డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని నిపుణులు చెప్పారు. అందుకని మీరు వీలైతే పవర్ బ్యాంక్ వంటి వాటిని తీసుకు వెళ్ళండి. అంతే కానీ ట్రైన్లలో మెట్రో ట్రైన్ లలో మీ ఫోన్స్ కి ఛార్జింగ్ ని మాత్రం పెట్టొద్దు ఒకవేళ పెట్టారంటే ఈ సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news