మానవ మనుగడుకు చెట్లే జీవనాధారం.. చెట్లను పెంచేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. పట్టణాల్లో కూడా మొక్కల పెంపకం పెరుగుతుంది. చెట్లు లేని ఇళ్లు ఉంటుంది కానీ.. దేశం ఉంటుందా..? చెట్లే లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా..? ఉన్నాయి. అసలు చెట్లు లేకుండా ఆ దేశంలో ప్రజలు బతుకుతున్నారు..? అనే డౌట్ మీకు కూడా వస్తుందా..? చెట్లు లేని దేశాలు ఏంటో తెలుసుకుందాం రండీ..!
గ్రీన్‌ల్యాండ్: పులిహోరలో పులి లేనట్లే.. గ్రీన్ ల్యాండ్ గ్రీనరీ లేదు.. అసలు ఈ దేశంలో చెట్లే లేవు.. వేల మైళ్ల దూరం ఈ దేశంలో ఒక్క చెట్టు కూడా కనిపించదు. గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఈ ప్రదేశం చుట్టూ హిమానీనదాలు కనిపిస్తాయి.
ఖతార్: భారీ గ్యాస్ నిల్వలకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం సౌదీ అరేబియా మరియు పర్షియన్ గల్ఫ్‌తో చుట్టుముట్టింది. దేశం మొత్తం ఎడారి కాబట్టి ఇక్కడ ఎక్కడా ఒక్క మొక్క కూడా కనిపించదు. చమురు నిల్వలు మరియు ముత్యాల ఉత్పత్తి కారణంగా, ఈ దేశం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ చెట్లు లేకపోవడంతో పండ్లు, పూల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నారు.
అంటార్కిటికా: ఈ జాబితాలో అంటార్కిటికా కూడా ఉంది. ఈ దేశంలో 98% మంచుతో కప్పబడి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశంగా పరిగణించబడుతుంది. వేసవిలో కూడా, ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ ఏ వృక్షజాలం పెరగడం అసాధ్యం.
చెట్లు లేకుండా గ్రామాన్నే ఉహించుకోలేం. అలాంటిది దేశాలు ఉన్నాయి.. మొక్కల వల్ల మనుషులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి మన కార్బన్‌డై ఆక్సైడ్ పీల్చుకోని ఆక్సీజన్ వదులుతాయి. ప్రకృతి మనకు ఎన్నో అందిస్తుంది. అందుకే ప్రకృతిని కాపాడుకోవడం మన నైతిక బాధ్యత. ఇంట్లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచుకోవడం అందరూ అలవాటు చేసుకోవాలి. పిల్లలకు మొక్కలపై ప్రేమను పెంచాలి. తల్లిదండ్రులకు ఇది మీ బాధ్యత.