వరుసగా కొన్నిరోజులు పాటు నిద్రపోకుండా ఉంటే ఏం అవుతుందో తెలుసా..?

-

మనం ఎప్పుడూ నిద్రలేకపోతే.. వచ్చే అనారోగ్య సమస్యల గురించే మాట్లాడుకున్నాం.. నిద్రలేమి అంటే.. లేటుగా నిద్రపోవడం, నిద్రసరిగ్గా పట్టకపోవడం.. కానీ అసలు కంప్లీట్‌గా నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? మీరు మీ లైఫ్‌లో ఇప్పటివరకూ ఎప్పుడైనా పూర్తిగా నిద్రపోకుండా ఎన్నిరోజులు ఉన్నారు. ఒక గంట కూడా నిద్రపోకుండా.. అసలు అలా ఉండలేరు కదా..! కనీసం రెండు మూడు గంటలైనా నిద్రపోయి ఉంటారేమో కానీ.. పూర్తిగా నిద్రలేకుండా అయితే మనం ఉండలేం. కానీ అలా ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నారు తెలుసా..? నిరంత‌రాయంగా కొన్ని రోజుల పాటు నిద్ర‌పోకుండా ఉంటే ఏమ‌వుతుంది..? అస‌లు అలా ఉండ‌గ‌ల‌మా..? ఉంటే పిచ్చి వార‌వుతారా..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నిషికి క‌చ్చితంగా నిద్ర కావ‌ల్సిందే. నిద్ర పోకుండా ఎవ‌రైనా నిరంత‌రాయంగా 3 రోజుల‌కు మించి ఉండ‌లేరు. ఆ త‌రువాత నిద్ర వ‌స్తూనే ఉంటుంది. ఏ పని చేసినా, ప‌గలైనా, రాత్ర‌యినా నిద్ర వ‌స్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు నిద్ర‌పోకపోతే శరీరం బాగా అల‌సిపోతుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. క‌చ్చితంగా విశ్రాంతి కోరుకుంటుంది. కానీ ర్యాండీ గార్నర్ అనే వ్య‌క్తి వ‌రుస‌గా 11 రోజుల పాటు నిద్ర పోలేదు. దీంతో అత‌ని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌కు ఎక్కింది. ఇక అంత క‌న్నా ఎక్కువ రోజులు నిద్ర పోకుండా ఇప్పటి వరకూ ఎవ‌రూ లేరు. క‌చ్చితంగా ఏదో ఒక రోజున ఎవ‌రైనా నిద్ర పోతారు. లేదంటే మృత్యువు బారిన ప‌డ‌తారు.

నిద్ర లేకపోతే పిచ్చివాళ్లు అవుతారా..?

ఇక అలా కొన్ని రోజుల పాటు నిద్ర పోకుండా ఉన్నవారు పిచ్చి వారుగా మారుతారా..? అంటే.. అలా ఏం కాదట.. సైంటిస్టులే నిర్దారించారు. వారు కొంద‌రు మ‌నుషుల‌పై చేసిన ప్ర‌యోగాల‌ను బ‌ట్టి ఈ విష‌యాన్ని తేల్చి చెప్పారు. అయితే నిరంత‌రాయంగా కొన్ని రోజుల పాటు నిద్ర‌పోని వారు పిచ్చివారు కారు, కానీ.. అలాంటి వారికి నిజ జీవితంలోనూ క‌ల‌లు వ‌స్తాయ‌ట‌. అంటే.. ప‌గ‌లైనా, ఆ స‌మ‌యంలో ఏ ప‌ని చేస్తూ ఉన్న‌ప్ప‌టికీ నిద్ర పోయిన‌ప్పుడు క‌న్న‌ట్టు క‌ల‌లు కంటార‌ట‌. అవును, ఈ విష‌యాన్ని కూడా సైంటిస్టులే నిర్దారించారు.

నిద్రను త్యాగం చేసి మీరు చేసేది ఎంత ముఖ్యమైన పని అయినా సరే.. అది మీ ప్రాణం కంటే విలువైనది కాదేమో కదా..! కాబట్టి నిద్ర ఆపుకోని మరీ చాటింగ్‌లు చేయడం, సోషల్‌ మీడియాలో టైమ్‌ వేస్ట్‌ చేయడం, అదేపనిగా టీవీలు చూడటం చేయకండి అంటున్నారు వైద్యులు

Read more RELATED
Recommended to you

Exit mobile version