Upasana : గ్రాండ్ గా ఉపాసన బేబీ షవర్.. ఫొటోలు వైరల్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాసనకు తన స్నేహితులు దుబాయ్ లో గ్రాండ్ గా సీమంతం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మరోసారి ఉప్సీకి బేబీ షవర్ జరిగింది. అయితే ఈసారి జరిగింది మెగా కాంపౌండ్ లో.

హైదరాబాద్‌లో మరోసారి ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కలిసి ఉపాసనకు బేబీ షవర్‌ ఫంక్షన్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫంక్షన్‌కు అల్లు అర్జున్‌ కూడా హాజరయ్యారు. ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్‌ స్టాలో షేర్‌ చేశారు. ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘సో హ్యాపీ ఫర్‌ మై స్వీటెస్ట్‌ ఉప్సీ’’ అని క్యాప్షన్‌ రాశారు. అలాగే ఎంతో సరదాగా జరిగిన ఈ వేడుకలో సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్‌ చరణ్‌  ఫ్రెండ్స్‌ కూడా సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version