ఓరి నాయనో..ఈ కుక్కకు అది ఎక్కువే..వీడియో..

-

జంతువుల కన్నా మనుషులకు తెలివి ఎక్కువ అంటారు. ఇది ఒకప్పటి మాట..ఫర్ ఎ చేంజ్.. మనుషుల తెలివితో పోలిస్తే జంతువుల తెలివి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది.. అతి తెలివి మీరి పోతూన్నాయి. సోషల్ మీడియాలో జంతువులకు పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..ఆ వీడియోలకు మనుషులు కూడా తెగ ఫిదా అవుతున్నారు. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది..యజమానులు వాటికి ఒక్కసారి చెబితే అంతే ఈజీగా నేర్చేసుకుంటున్నాయి. అంతే కాకుండా వాటి ప్రతిభను అందరికి చూపించాలన్న ఉద్దేశ్యంతో వాటి యజమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి చాలా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

తాజాగా ఓ కుక్క వీడియో తెగ వైరల్ అవుతుంది..అది అందరు అనుకున్న విధంగా మామూలు కుక్క కాదు..ఒకసారి ఏదైనా చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తుంది..ఆ కుక్క డ్రైవింగ్ ను చూస్తె షాకవ్వాల్సిందె..ప్రొఫిషనల్ డ్రైవర్ కూడా పనికి రారు అనే చెప్పాలి.తన యజమాని ఎలా చెప్పాడో అలా ఆ కుక్క డ్రైవింగ్ చేసింది.కుక్క తెలివికి మెచ్చుకుంటున్నారు. ఇది విక్టోరియాలోని హామిల్టన్ కు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాడు. ఆ కుక్క కూడా చాలా అద్భుతంగా డ్రైవింగ్ నేర్చుకుంది. అదేంటి కుక్క హైట్ కు డ్రైవింగ్ ఎలా సాధ్యపడుతుంది? అని చాలా మందికి అనుమానం రావొచ్చు..

ఆ కుక్కకు యాక్సిలరేటర్, ఇంకా బ్రేక్ అందకపోయినా కానీ స్టీరింగ్ ను మాత్రం చాలా బాగా కంట్రోల్ చేస్తుంది.వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్రైవింగ్ మాత్రమే కాదండోయ్.. ఈ కుక్క గొర్రెల కాపరిగా కూడా ఇరగదీసిందట. ఇలా డ్రైవింగ్ నేర్చుకుని ట్రక్ నడిపే కంటే ముందు ఈ కుక్క గొర్రెల కాపరిగా పని చేసేదట. కుక్క గొర్రెల కాపరిగా పని చేసినపుడు ఒక్క గొర్రెను కూడా మంద నుంచి బయటకు పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించేదని ఆ యజమాని చెబుతున్నాడు. కుక్క తెలివితేటలతో తాను ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానని ఆ యజమాని అంటున్నారు.ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..వీలైతే ఓ లైక్ వేసుకోండి..

 

Read more RELATED
Recommended to you

Latest news