వైరల్ వీడియో: గుడిముందు కూర్చుని ఆశీర్వాదాలిస్తున్న కుక్క..

దేవుడి గుడి చుట్టూ జంతువులు ప్రదక్షిణలు చేయడం సహా చాలా జంతువులు దేవుడి గుళ్ళో రకరకాలుగ ప్రవర్తించే అనేక వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఒకానొక వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక కుక్క, దేవుడి గుడి మెట్ల ముందు కూర్చుని, వచ్చి పోయే వారికి ఆశీర్వాదాలు ఇస్తుంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

చాలా జంతువులు గుళ్ళలోకి వచ్చి వింత వింత చేష్టలు చేయడం చూసాం. ఐతే అవన్నీ ఒక ఎత్తైతే, దేవుడి గుడికి వచ్చిన భక్తులకి ఆశీర్వాదాలు ఇవ్వడం మరో ఎత్తు. గుడి ముందు మెట్ల పక్కన ఒక పొడుగాటి గద్దె మీద ఠీవీగా కూర్చున్న కుక్క దగ్గరకి ఒక మహిళ వెళ్ళి చేయి చాపింది. అప్పుడు ఆ కుక్క, తన చేయిని ఆమెకి అందించి షేక్ హ్యాండ్ అందించింది. అది చూసిన జనాలందరూ తాము కూడా అలాగే చేసారు. తనకి చేయందించిన ప్రతీ ఒక్కరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ అందరికీ ఆశర్యాన్ని కలిగించింది.

మరో వీడియోలో మరింత ముందుకు వెళుతూ, ఒకానొక వ్యక్తి షేక్ హ్యాండ్ తీసుకుని తన తలను కిందకు వంచాడు. అప్పుడు ఆ కుక్క ఆశీర్వాదం ఇచ్చింది. ఈ విధంగా ప్రతీ ఒక్కరికీ ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంది. మహారాష్ట్రలోని సిద్ధటెక్ లోని సిద్ధి వినాయక్ గుడిలో జరిగిన ఈ సంఘటన చూపరులని ఆకట్టుకోవడమే కాదు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం కుక్క ఆశీర్వదించిన వీడియోలు దేశమంతటా వైరల్ అవుతున్నాయి. ఆ కథాకమామీషు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి.