ఎక్కడైనా దేవుళ్లను పూజిస్తారు కానీ… కుక్కలను పూజించడమేందిరా సామీ. ఇదేం ఆచారం అంటారా? ఏమో వాళ్ల ఆచారం అలా ఉంది మరి.. మనమేం చేస్తం. ఇంతకీ ఎక్కడ బాబు ఈ కుక్కల పూజ అంటారా? నేపాల్ లో. అక్కడ దీపావళి టైమ్ లో ఐదురోజుల పాటు తిహార్ అనే పండుగ జరుపుకుంటారట. అది హిందువుల పండుగే. ఐదు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దాన్ని పూజిస్తారు. రెండో రోజు ఇలా కుక్కలను పూజిస్తారట. వాటికి దండేసి, బొట్టు పెట్టి పూజలు నిర్వహిస్తారట. మొదటి రోజు కాకులను పూజిస్తారట. రెండో రోజు కుక్కలు, మూడో రోజు ఆవులు, నాలుగో రోజు ఎద్దులను పూజిస్తారట. బాగుంది కదా వీళ్ల పండుగ.
ఇక.. కుక్కల పండుగ జరుపుకోవడానికి ఓ కారణం కూడా ఉందట. కుక్కలను, మనుషులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని.. కుక్కలకు, మనుషులకు మధ్య ఉన్న సంబంధానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారట. బాగుంది కదా పండుగ. ఫోటోలు కూడా చూశారుగా.. ఎలా కుక్కలను అలంకరించి వాటికి పూజలు చేస్తున్నారో? నేపాలీయలంటే నేపాలీయులే. అన్నిట్లో వాళ్ల రూటే సెపరేటు.