ఫ్రీల్యాన్స్ జాబ్ చేస్తున్నారా..? అయితే ఈ ట్యాక్స్ రూల్స్ ని చూడాల్సిందే..!

-

చాలా మంది ఈ మధ్య కాలం లో ఫ్రీల్యాన్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు కూడా ఫ్రీలన్సర్ గా పని చేస్తున్నారా..? అయితే ఈ ట్యాక్స్ రూల్స్ చూడాల్సిందే. అయితే చాలా మందికి ట్యాక్స్ ఫైలింగ్ పై అవగాహనా లేదు. ఫ్రీల్యాన్సింగ్ ద్వారా ఆర్జించే ఆదాయాలను వ్యాపారాలు లేదా ప్రొఫెషన్ నుంచి వచ్చిన లాభాలుగా పరిగణిస్తారు. స్వయం ఉపాధి కింద వచ్చే ఆదాయాలుగా వీటిని కాలిక్యులేట్ చేస్తారు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…. ఫ్రీల్యానర్ కూడా ప్రతేడాది ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలి. ఐటీఆర్-3, ఐటీఆర్-4 లో ఫ్రీల్యాన్సర్లు దరఖాస్తు చేసుకోవాలి. వేతన జీవులు ఫ్రీల్యాన్సింగ్ కింద కూడా ఇన్కమ్ వస్తూ ఉంటే వ్యాపారం లేదా ప్రొఫెషన్ ఆదాయం కింద ఐటీఆర్ ఫామ్‌ను ఫిల్ చెయ్యాలి.

ఫ్రీల్యాన్స్ కింద ఆదాయం సంపాదించే వాళ్ళు వారికయ్యే ఖర్చులను మినహాయింపులను కోరచ్చు. ప్రాపర్టీ రెంట్లు, ఆ ప్రాపర్టీలకయ్యే మరమ్మత్తుల ఖర్చులు, ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్ మరియు వాటి రిపేర్ ఖర్చులు క్లెయిమ్ చేసుకోచ్చు. అలానే ఇంటర్నెట్ బిల్లులు, ఫోన్ బిల్లులు, ట్రావెల్ ఖర్చులు వంటివి కూడా క్లెయిమ్ చెయ్యచ్చు.

కానీ ఫ్రీల్యాన్సర్లు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లయిమ్ చేసుకోలేరు. ఫ్రీల్యాన్సింగ్‌ ఆదాయంతో పాటు వేతనం పొందే పన్ను చెల్లింపుదారులు మాత్రం ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను పొందే అవకాశం వుంది. ఫ్రీల్యాన్సర్లకు జరిపే పేమెంట్లలోనే టీడీఎస్‌ను కట్ చేసి కంపెనీలు పే చేస్తాయి. ట్యాక్స్ లయబులిటీని లెక్కించే ముందు తప్పనిసరిగా ఈ టీడీఎస్‌ను చేర్చాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news