ప్రజాసమస్యలు, తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతున్నారు. వరసగా వాయిదా తీర్మాణాలు ఇస్తున్నారు. తాజాగా షెడ్యూల్ కులాల వర్గీకరణపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వాయిదా తీర్మాణం ఇచ్చారు. నిన్న కుల గణన జరగాలని.. ఈ అంశంపై చర్చించాలని రాజ్యసభలో కేశవరావు, లోక్ సభలో నామానాగేశ్వర్ రావు వాయిదా తీర్మాణాలు ఇచ్చారు. అయితే సభాపతులు వీటిని తిరస్కరించారు. దీంతో ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
తాజాగా షెడ్యూల్ కులాల వర్గీకరణపై టీఆర్ఎస్ వాయిదా తీర్మాణాన్ని లోక్ సభ స్పీకర్ అనుమతి ఇస్తారో లేదో చూడాలి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పాటు… అనేక సమస్యలపై వరసగా వాయిదా తీర్మాణాలు ఇస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి చర్చించాలని వాయిదా తీర్మాణం ఇచ్చింది. ఆసమయంలో కూడా సభాపతులు దీనికి అంగీకరించలేదు. అప్పుడు కూడా తన నిరసనను తెలియజేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.