మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో మీ ప్రొఫైల్‌ పెట్టేప్పుడు ఈ తప్పులు చెప్పకండి… దొరికిపోతారు..!

-

ఆన్‌లైన్ డేటింగ్ విషయంలో చాలా మంది కొన్ని విషయాలపై అబద్ధాలు చెబుతారు. కానీ దీని వల్ల తర్వాత వాళ్లే భాదపడతారు. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అలా అని ఈ విషయాల్లో అబద్ధాలు చెబితే పెళ్లి పెటాకులు అవుతుంది. ముఖ్యంగా మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో మీ ప్రొఫైల్‌ను పెట్టుకునేప్పుడు ఈ విషయాల్లో తప్పులు చెప్పకండి.

ప్లాట్‌ఫారమ్‌లను ‘మ్యాట్రిమోనియల్ సైట్‌లు’ అంటారు. కానీ ఈ సైట్‌లలో చాలా మోసాలు కూడా ఉన్నాయి. తెలియకుండా చేసిన తప్పు మీ జీవితమంతా నాశనం చేస్తుంది. మన సమాజంలో ముఖ్యంగా వధూవరుల వివాహ సమయంలో చర్మం రంగు గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వకపోవడం పెద్ద సమస్య. మీ కలర్‌ గురించి తప్పుగా చెప్పకండి. నలుపు అయితే నలుపు అనే చెప్పాలి. ఫిల్టర్‌ వేసిన ఫోటోలు పెట్టి చర్మం రంగుకు ఎక్కువ రంగు వేయకపోవడమే మంచిది. ఈ సమస్య కారణంగా, పెళ్లి రోజున కూడా చాలా వివాహాలు విచ్ఛిన్నమవుతాయి. అటువంటి పరిస్థితులను నివారించడానికి, మొదటగా, చర్మం రంగు గురించి నిజమైన సమాచారం ఇవ్వాలి.

వయసు పెరిగే కొద్దీ పెళ్లికి భాగస్వామిని వెతకడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు. చాలా మంది తమ వయస్సును దాచుకోవడానికి అబద్ధాలు చెప్తారు. మీ వయస్సుకు మీ శరీరానికి సంబంధం ఉంటుంది. కాబట్టి వయసు తగ్గింపు అని చెప్పినా వయసు సంబంధిత సమస్యలను ఎక్కువ కాలం దాచలేరు. కాబట్టి, ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లలో వయస్సును ఎప్పుడూ తప్పుగా చూపించకూడదు.

మ్యాట్రిమోనియల్ సైట్లలో ఇలాంటి కేసులు చాలా జరుగుతాయి, ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిల దృష్టిని ఆకర్షించడానికి వారి వృత్తిని తప్పుగా చెప్పడం, లేదా జీతం గురించి తప్పుగా చెప్తారు. వృత్తి పరంగా చాలాసార్లు మాయమాటలు చెప్పి వధువు కుటుంబం నుంచి మరింత కట్నం వసూలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పెళ్లి గురించి మాట్లాడే ముందు ప్రభుత్వ పత్రాలను సరిగ్గా సరిచూసుకోవాలి.

మ్యాట్రిమోనియల్ సైట్లలో తమ కుటుంబ నేపథ్యాన్ని చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. లేని బ్యాగ్రౌండ్స్‌ గురించి అబద్ధాలు చెప్తారు. అలా అస్సలు చేయకూడదు. చాలా మంది అమాయక వధూవరులు మంచి భవిష్యత్తు కోసం ఆశతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబం నేపథ్యం అంతా తప్పు అని తెలిసి చాలా బాధపడతారు. అది పెళ్లిని విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తుంది.

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే, చాలా మంది తమ ప్రేమ లేదా మాజీ ప్రేమ సంబంధం గురించి పూర్తిగా అబద్ధం చెబుతారు. చాలా మంది తమ మొదటి వివాహాన్ని రహస్యంగా ఉంచిన తర్వాత రెండవ వివాహం చేసుకోవాలని కూడా ప్రయత్నిస్తారు. పెళ్లికి ముందు వధువు లేదా వరుడి వ్యక్తిగత పత్రాలు ధృవీకరించాలి. ఇతర సామాజిక సైట్‌లలో కూడా మీరు పేరు, ఫోటో లేదా కుటుంబ సభ్యుల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news