మీ భాగస్వామితో పంచుకోకూడని కొన్ని రహస్యాలు.. పంచుకున్నారో కొంప కొల్లేరే..

-

ఎంత భార్యాభర్తలైనా ప్రతీ విషయం చెప్పాలని అనుకోకూడదు. కొన్నింటినీ రహస్యంగా ఉంచాలి. అవి మీ జీవితంలో జరిగిన మీ వ్యక్తిగత విషయాలు కాకపోయినా కొన్ని విషయాలని భాగస్వాములతో పంచుకోకూడదు. ఆ విషయాలేంటో చూద్దాం.

మీ పాత ప్రేమల్ని అస్సలు చెప్పకండి. వారికి విందామని ఆసక్తిగా ఉన్నా మీరు చెప్పవద్దు. మీకే ప్రేమకథలు లేవు అని చెబితే ఎవరూ నమ్మకపోయినప్పటికీ, ఆ విషయాల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు కనిపించవద్దు. అలాగే మీరు కూడా మీ భాగస్వామి ప్రేమకథల్ని (గతంలో జరిగినవి) వినాలని అనుకోవద్దు.

ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో చెప్పకండి. చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు వింత వింత చేష్టలు చేస్తుంటారు. అవి చెబితే మీ మీద గౌరవం తగ్గిపోయే అవకాశం ఉంది. అదీగాక ఎప్పుడైనా మీ బంధంలో గొడవలు వస్తే ఆ విషయాలు బయటకి తెలిసే అవకాశం ఉంటుంది.

మీ భాగస్వామి కుటుంబ సభ్యుల పట్ల మీ అయిష్టాన్ని తెలియజేయకండి. మీకు వాళ్ళు నచ్చకపోవచ్చు. కానీ మీ భాగస్వామి కుటుంబ సభ్యులు కాబట్టి అంటీ ముట్టనట్టుగా ఉండండి.

మీకిష్టం లేని వారు మార్చుకోలేని విషయాల గురించి మీ భాగస్వామితో చెప్పవద్దు. ఎలాగూ మారరు అని తెలిసినపుడు మీఖు నచ్చదనే విషయం వారికి తెలియాల్సిన అవసరం ఏముంది.

మీ భాగస్వామి స్నేహితులు అందంగా ఉన్నట్లు మీకనిపిస్తే ఆ విషయాలు మీ భాగస్వామితో పంచుకోవద్దు. దీనివల్ల పెద్ద యుద్ధాలే జరిగే అవకాశం ఉంది.

మీ వ్యక్తిగత సొమ్ము దేనికి ఖర్చు చేస్తున్నారనేది మీ భాగస్వామికి తెలియనివ్వవద్దు. లేదంటే ముందు ముందు ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఎక్కువ.

Read more RELATED
Recommended to you

Exit mobile version