నిద్రించేప్పుడు వచ్చేకలకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవి మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే చెప్పేదానికి సంకేతాలు. కొన్ని కలలు శుభప్రదం అవుతాయి. మరికొన్ని చెడ్డవి కూడా అవుతాయి. అలా మనల్ని హెచ్చరిస్తాయి. అయితే చాలా కలలు తెల్లారగానే..అవి తెల్లారతాయి. అసలు గుర్తుకు ఉండవు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వస్తువులు, సంఘటనలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
కలలో మీరు ఆకాశంలో నల్లటి మేఘాలను చూస్తే వ్యాపారాన్ని కోల్పోవచ్చు. కలలో తేనెటీగ కనిపిస్తే మీరు ఎక్కడి నుంచైనా డబ్బు పొందబోతున్నారని సంకేతమట. కలలో ఏనుగు, ఎద్దు , సింహం, సముద్రం చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. త్వరలో డబ్బు అందుకోబోతున్నారని వాటికి అర్థంమట. మీరు కలలో వంతెన దాటుతున్నట్లు అనిపిస్తే ఆర్థిక చింతల నుంచి బయటపడబోతున్నారని ఆ కలకు సంకేతం. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని అర్థమట.
గమనిక: పై కథనానకి ఎలాంటి ఆధారాలు లేవు. పాఠకులు ఆస్తకిని దృష్టిలో పెట్టుకుని స్వప్నశాస్త్రం ప్రకారమే మీకు ఈ సమాచారం అందించబడిందని గమనించగలరు.
-Triveni Buskarowthu