ముస్లిం దేశంలో 30,225 మండపాలలో దుర్గా పూజ…!

-

బంగ్లాదేశ్ లో… దుర్గాపుజ హిందువుల అతిపెద్ద పండుగ. ప్రతీ ఏటా కూడా అక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 30,225 మండపాలలో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని అక్కడి అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి పూజా ఉద్జపాన్ పరిషత్ నిర్మల్ కుమార్ ఛటర్జీ ఈ విషయం చెప్పారు. ఆ దేశ అధికారిక వార్తా సంస్థ బిఎస్ఎస్ లో ప్రచురించారు.

కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం మండపాల సంఖ్య 1173 తగ్గింది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా 31,398 మండపాలలో పూజలు నిర్వహించారు. డాకాలో 233 పూజ మండపాలు ఈ సంవత్సరం దుర్గా పూజను నిర్వహించనున్నాయి. గత సంవత్సరం, రాజధాని నగరంలో దుర్గా పూజ కోసం 237 మండపాలు ఉన్నాయి. ఐదు రోజుల నిడివి గల శారదియ దుర్గోత్సబ్ అక్టోబర్ 22 న ‘కల్పరంభో’తో ప్రారంభమవుతుంది, విగ్రహాల నిమజ్జనంతో అక్టోబర్ 26 న ఈ కార్యక్రమం ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news