ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధం ఉన్నందుకు గానూ… అలాగే దేశంలో ఉగ్రవాద చర్యలకు ముస్లిం యువకులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నియమించడం ద్వారా భారతదేశంలో తమ స్థావరాన్ని స్థాపించడానికి కుట్ర పన్నిన 15 మందికి ఢిల్లీ కోర్ట్ తీవ్ర్ శిక్షలు విధించింది. పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పర్వీన్ సింగ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం మరియు పేలుడు పదార్థాల చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర మరియు ఇతర నేరాలకు శిక్ష విధించారు.
నఫీస్ ఖాన్ కు 10 సంవత్సరాలు, ముగ్గురు దోషులను ఏడు సంవత్సరాలు, ఇద్దరికి ఆరు సంవత్సరాలు, తొమ్మిది మందికి ఐదేళ్లపాటు జైలుకు పంపారు. ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించే వారిలో అబూ అనాస్, ముఫ్తీ అబ్దుల్ సామి కస్మి, ముదబ్బీర్ ముష్తాక్ షేక్ ఉండగా, అమ్జాద్ ఖాన్, అజార్ ఖాన్లను ఆరేళ్ల జైలుకు పంపారు.