ఆడ ఏనుగులకు ఇష్టమైన ఏనుగు చచ్చిపోయింది…!

-

ఆఫ్రికాలో మిగిలి ఉన్న చివరి పెద్ద దంతాల ఏనుగు మంగళవారం మరణించింది. దీనిని టిమ్ అని పిలుస్తారు. బిగ్ టస్కర్ లేదా బిగ్ టిమ్ అని అంటూ ఉంటారు. 52 సంవత్సరాల వయస్సులో ఆ ఏనుగు మరణించినట్లు కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ తెలిపింది.కెన్యాలోని అంబోసేలి నేషనల్ పార్క్‌లోని మాడా ప్రాంతంలో బిగ్ టిమ్ తుది శ్వాస విడిచింది. ఈ ఏనుగు, దక్షిణ కెన్యాలోని విస్తారమైన మరియు మారుమూల అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది.

కొన్నేళ్ళ క్రితం ఆ ఏనుగుపై దాడి జరిగింది. బండ రాయితో ఆ ఏనుగుపై దాడి చేసారు. రాతితో చేసిన ఈతే దాని చెవిలో గుచ్చుకుంది. ఇప్పటికి ఈటె యొక్క కొన ఆ ఏనుగులో భుజంలో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దాన్ని అంబోసేలి నేషనల్ పార్క్‌ చిత్తడి నేలల్లోకి వదిలిపెట్టారు అధికారులు. ఇప్పుడు ఆ ఏనుగు మృతదేహాన్ని నైరోబిలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ కెన్యాకు టాక్సీడెర్మిస్ట్ కోసం తీసుకువెళుతున్నారు.

అయితే ఈ ఏనుగుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఏనుగు వయసుకి వచ్చిన తర్వాత ఆడ ఏనుగులలో ఎక్కువగా తిరిగింది. ఆ ఏనుగులు కూడా దానితోనే ఎక్కువగా ఉండేవి. ఈ ఏనుగుకి కెన్యాలో అభిమానులు ఉన్నారని కెన్యా వైల్డ్ లైఫ్ తన వెబ్‌సైట్‌లో రాసింది. ఆ ఏనుగు వయోభారంతో మరణించింది అని అధికారులు తెలిపారు. నాలుగు నెలల క్రితం మాట్నూ అనే ఒక ఏనుగు కూడా ప్రాణాలు కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news