తాలిబన్లకు సాక్ ఇచ్చిన ఫేస్ బుక్‌.. డేరింగ్ స్టెప్‌

-

ఆప్ఘనిస్తాన్‌లో ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటెంట్ రాజ్యస్థాపనకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశం నుంచి ప్రజలు పారిపోతున్నారు. కాబుల్ ఎయిర్ పోర్ట్‌లో కదిలే విమానం మీదకు ఎగ్గి ముగ్గురు గాలిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఆ దేశం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఇక మహిళలయితే దేశంలో ఆరాచకం జరగబోతున్నదని భయాందోళనకు గురవుతున్నారు. తమకు రక్షణ అనేది ఉండబోదని వాపోతున్నారు. తాలిబన్ల ఈ చర్యలను అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోంది.కాగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో పాటు పలు సామాజిక మాద్యమాలు ఈ విషయాలపై రియాక్ట్ అయ్యాయి. ఈ అంశంపై ఫేస్‌బుక్‌ ప్రతినిధి మాట్లాడుతూ అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ అని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ తన విధానాల ప్రకారం తాలిబాన్ సేవలను నిషేధించినట్లు పేర్కొన్నారు. దాంతో ఇక ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంపై తాలిబాన్లు నిషేధించబడ్డారు. ఈ క్రమంలోనే అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.తాలిబన్లను ప్రోత్సహించే కంటెంట్‌ను బ్రేక్ చేసింది ఈ సోషల్ మీడియా దిగ్గజం. ఈ విషయమై ఫేస్‌బుక్ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోసేరి బ్లూమ్‌బెర్గ్ స్పందించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థ పేరు టెర్రరిస్టు జాబితాలో ఉన్నందున వారి గ్రూప్‌ను ప్రోత్సహించే లేదా ప్రాతినిథ్యం వహించే ఏదైనా కంటెంట్ నిషేధించబడుతుందని పేర్కొన్నారు. దాంతో ఇన్ స్టా గ్రామ్‌లోనూ తాలిబన్ అకౌంట్స్ ఉండబోవు. మొత్తంగా ఫేస్‌బుక్, ఇన్ స్టా గ్రామ్ తాలిబన సమాచారాన్ని అంతా తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించే పనిలో పడింది. ఆప్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మరుసటి రోజు ఆప్ఘన్ క్యాపిటల్ కాబుల్‌పైన ఇక తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తాలిబన్లు కాబుల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version