అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేయగా.. తాజాగా అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. దీంతో అఫ్ఘనిస్థాన్ అన్ని సరిహద్దులను స్వాధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు. అఫ్ఘాన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని తరలిస్తోంది అగ్ర రాజ్యం అమెరికా. హెలికాఫ్టర్ల ద్వారా రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తరలిస్తోంది.
అంతేకాదు.. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్లు సమచారం అందుతోంది. ఇప్పటికే ఆఫ్గాన్ ఆర్థిక మంత్రి పారిపోగా.. ఇప్పడు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా వెళ్లే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. అస్థిరత ప్రమాదంలో ఆఫ్ఘనిస్థాన్ ఉందని ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు. ఈ పరిస్థితులపై స్థానిక నేతలతోనూ, అంతర్జాతీయ భాగస్వాములతోనూ చర్చిస్తున్నామని చెప్పారు. తాలిబన్లు తమ ప్రాబల్యాన్ని క్షణక్షణం పెంచుకుంటున్నారని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌కు దక్షిణ దిశలో ఉన్న ప్రావిన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.