వైరల్‌ వీడియో : విండో సీట్‌ కోసం విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ

-

విమానాల్లో, మెట్రోలో ఎప్పుడూ ఏదో ఒక ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మొన్నటికిమొన్న విమానంలో బరువు ఎక్కువైందని నిర్ధాక్షిణంగా 19 మంది ప్రయాణికులను దింపేశారు. ఇప్పుడు విమానంలో విండో సీట్‌ కోసం పంపుల దగ్గర మంచినీళ్లు కోసం కొట్టుకున్నట్లు ఇద్దరు ప్రయాణికులు జట్లు పట్టుకోని మరీ కొట్టుకున్నారు. అసలు ఎవరు ఏ సీట్‌లో కుర్చోవాలో మనకు నెంబర్‌ వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా మనం కుర్చోవాలి. మధ్యలో మరీ వీళ్లకు విండో సీట్ దగ్గర లొల్లి ఎందుకు వచ్చిందో. బస్సులోలా ముందు నేను ఎక్కాను విండో సీట్‌ నాది అని గొడవపడ్డారా ఏంటి..?

మాల్టా నుంచి లండన్ వెళ్లడానికి ర్యాన్ ఎయిర్ విమానం(ryanair flight)రెడీగా ఉంది. ఒక్కొక్కరిగా ప్రయాణికులు విమానంలోకి వస్తున్నారు. విమానంలో మధ్య సీటు ఉన్న ప్రయాణీకుడు ముందుగా వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అయితే అతడి పక్కన ఉన్న విండో సీటు సీటులో కూర్చునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే నడవ సీటులో కూర్చున్న వ్యక్తి విండో సీటు ప్రయాణికుడిని కిటికీ వైపుకి వెళ్లడానికి అనుమతించలేదని చెబుతున్నారు. దీని గురించే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఈ సీటింగ్ ఏర్పాటుపై వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ముందుగా కొంత మంది ప్రయాణికులు వారిద్దరినీ శాంతింపజేసేందుకు ముందుకు వచ్చారు.

https://www.facebook.com/watch/?v=1622981111445073

సిబ్బంది కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు చాలా దూషించుకుంటూ కొట్టుకున్నారు. విమానంలో గొడవ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక్కడ తప్పు మధ్యలో సీట్‌ అతనిదే కదా.. అతన్ని దాటుకోనే విండో సీట్‌లో కుర్చోవాలి. అలాంటిది అతను ఎందుకు వెళ్లనివ్వలేదు అసలు.! వెళ్లనివ్వకపోతే ముందు సిబ్బందికి చెప్పాలి కానీ ఈ విండో సీట్‌ అతను అయినా ఎందుకు గొడవ పెట్టుకున్నాడు. అని నెటిజన్లు కమెంట్‌ ఇస్తున్నారు. ఎవర్రా మీరు ఇలా ఉన్నారు అంటూ మరో నెటిజన్‌ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version