రేపటి నుండి ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును చేరుకోనున్నాడు. సచిన్ తర్వాత తండ్రి కొడుకులతో మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా రికార్డును సొంతం చేసుకోనున్నాడు. అయితే ఇండియా తరపున ఆడనున్న మరో ప్లేయర్ కూడా ఒక రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఫార్మాట్ లలో కలిపి 700 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి మరో 3 వికెట్ల దూరంలో నిలిచి ఉన్నాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు సాధిస్తే ఈ మైలురాయిని అందుకుంటాడు. ఇక ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్ గా రికార్డ్ సృష్టించనున్నాడు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ రికార్డ్ సాధించిన 16 వ ఆటగాడిగా రికార్డ్ లలోకెక్కుతాడు.
IND VS WI: 700 వికెట్లకు చేరువలో స్పిన్నర్ అశ్విన్… !
-