ఇంట్లో చీమల బెడద ఎక్కువ అయితే.. ఈ చిట్కాలను ప్రయత్నించండి..!

-

సాధారణంగా ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో రకాల చిట్కాలను పాటించి వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉండడం సహజమే. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా 22 వేల చీమ జాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఉష్ణ మండల ఆస్ట్రేలియాలోని 5 వేలకు పైగా చీమ జాతులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి చుట్టూ మరియు ఇంట్లో ఎన్నో కీటకాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో, కుప్పలు కుప్పలుగా చీమలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెలుతూ కనబడతాయి. ముఖ్యంగా గోడ పగుళ్లు ఉండే ప్రదేశాలలో లేదా ఆహారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో చీమలు ఎక్కువగా ఉంటాయి.

కొంతమంది చీమలను చంపుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల జాతుల చీమలు ఎటువంటి హాని చేయవు. కాకపోతే, మరికొన్ని హాని చేస్తాయి. కనుక వాటిని చంపే ముందు, తర్వాతే ఎదుర్కొనే సమస్యల గురించి ఆలోచించాలి. అంతేకాకుండా ఎలాంటి తీయటి ఆహార పదార్థాలు కనిపించినా సరే ఒక ప్రత్యేక కెమికల్ ని చీమలు రిలీజ్ చేసి మిగిలిన చీమలకు సిగ్నల్ అందిస్తాయి. ఈ విధంగా అన్ని చీమలు ఒకే ప్రదేశానికి వెళ్లి ఆహారాన్ని తీసుకుంటాయి. దీంతో గుంపులు గుంపులుగా చీమలను చూస్తూ ఉంటాము. అయితే మీ ఇంట్లో చీమల బెడదను తగ్గించాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించండి.

ఎప్పుడైనా ఆహారాన్ని నిల్వ చేయడానికి, గాలి చొరబడకుండా ఉండేటువంటి డబ్బాలలో పెట్టి మూతవేయాలి. తీయటి పదార్థాలు వంటివి స్టోర్ చేసేటప్పుడు, ఎక్కువ సమయం బయట ఉంచకూడదు. ఇంట్లో ఉండేటువంటి డస్ట్ బిన్ మూతలను ఎప్పుడూ గట్టిగా మూత వేసి ఉంచాలి. ఎప్పుడైనా చీమలు గుంపులుగా వెళ్తున్నట్లయితే, వాటి కెమికల్ గుర్తులను చెరపడానికి వెనిగర్ లేక బ్లీచింగ్ పౌడర్‌ను ఉపయోగించాలి. ఇలా చేస్తే వాటి మార్గం పోతుంది. కనుక ఈ చిట్కాలను పాటించి చీమల బెడద నుండి విముక్తి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news