ఇంట్లో చెద పురుగులు ఎక్కువైతే.. ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..!

-

ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇంట్లో ఉండే వస్తువులను సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఫర్నిచర్‌ను సరైన విధంగా మెయింటైన్ చేయకపోతే చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది. ఎన్నో సందర్భాల్లో ఫర్నిచర్ మొత్తం పాడైపోయిన తర్వాత గమనిస్తారు. కలపతో తయారు చేసిన ఫర్నిచర్‌ను సరైన విధంగా మెయింటైన్ చేయకపోతే చెదలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య చాల ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ముందుగానే వీటిని గుర్తిస్తారో సమస్యను పరిష్కరించుకోవచ్చు లేకపోతే ఈ సమస్య ఎదురైనప్పుడు కలప పై భాగం చెక్కుచెదరుదు. కాకపోతే లోపల పూర్తిగా చెదలు పట్టి పాడైపోతుంది.

ఈ సమస్య బయటకు కనిపించకపోయినా, గోడలపై ఉండే మట్టి గడ్డలు, గుంపులుగా పడిపోయిన రెక్కలు వంటివి గుర్తించి కలపకు చెద పురుగులు వచ్చాయని గమనించాలి. ముఖ్యంగా కిటికీలు, డోర్లు దగ్గర ఈ పురుగుల రెక్కలు కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటుగా సౌండ్ టెస్ట్ ద్వారా కూడా పురుగులు వచ్చాయని తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చెక్కపై భాగంలో ఖాళీగా సౌండ్ వచ్చినట్లయితే పురుగులు ఉన్నాయని గుర్తించాలి. ఇటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు పురుగుల నిరోధానికి క్రిమిసంహారక మందులను ఉపయోగించాలి.

అంతేకాకుండా ఇంటి చుట్టూ ఉండే మట్టిలో లిక్విడ్ కెమికల్స్‌ను స్ప్రే చేయాలి. ఇలా చేస్తే ఇంటి పరిసరాల్లో కూడా వీటి వ్యాప్తి తగ్గుతుంది. చెద పురుగులను తగ్గించడానికి నారింజ నూనె కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఎన్నో గుణాలు ఈ పురుగులకు విషపదార్థంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వెనిగర్‌తో కూడా వీటిని తగ్గించవచ్చు. నీటిలో వెనిగర్ కలిపి చెక్క వస్తువులపై స్ప్రే చేయాలి. ఇలా చేస్తే చెద పురుగులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, చెదలు పట్టిన ఫర్నిచర్‌ను మూడు రోజులపాటుగా సూర్యరశ్మిలో ఉంచాలి. ఇలా చేస్తే ఎండ తీవ్రతకు పురుగులు చనిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news