ఆ గ్రామం అంతా దెయ్యాలే.. గోస్ట్‌ గ్రామంగా గిన్నిస్‌ రికార్డులోకి కూడా ఎక్కింది..!!

-

మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు. భూమండలం దాటి చంద్రమండలం వరకూ కూడా వెళ్తున్నాడు. కానీ నాలుగు రోడ్లు కలిచే చోట పెట్టిన నిమ్మకాయను మాత్రం దాటలేడు. ఫన్నీగా ఉన్నా ఇది నిజమే కదండీ..! నేటికి చాలా మంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే.. ఆ ఫీలింగ్‌ మనల్ని సగం సంపేస్తుంది. జనరల్‌గా దెయ్యాలకు నైట్‌ ఎఫెక్ట్స్‌ అంటేనే ఇష్టం.. అందుకే రాత్రైతేనే దెయ్యాలు వస్తాయి అనుకుంటాం. కానీ అక్కడ పగటిపూట కూడా ఊరంతా దెయ్యాలు తిరుగుతాయట. అక్కడ అసలు మనుషులు ఎవరో, దెయ్యాలో ఎవరో కూడా తెలియదట. అది దెయ్యాల గ్రామంగా గిన్నిస్‌ రికార్డులో కూడా ఎక్కిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోండి. ఇంతకీ ఈ దెయ్యాల ఊరు ఎక్కడ ఉందో తెలుసా..?

గోస్ట్ గ్రామం

గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కిన గ్రామం ఇంగ్లండ్‌లో దెయ్యాల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ప్లక్లీ కెంట్‌లోని ఒక దెయ్యం గ్రామం. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన గ్రామంగా పేర్కొంటారు. ఈ గ్రామంలో 12 కంటే ఎక్కువ భయానక ప్రదేశాలు ఉన్నాయి. దెయ్యాలు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతాయి. రాత్రే కాదు పగలు కూడా దెయ్యాలు కనిపిస్తాయని అంటున్నారు.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా ఈ గ్రామం పేరు ఎక్కిందంటే.. అక్కడ నిజంగానే దెయ్యాలు ఉండొచ్చు. 1989లో ఈ గ్రామం గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక్కడ తిరిగే ప్రతి ఒక్కరూ జీవించి ఉన్న మనుషులంటే నమ్మడం కష్టం. మీరు చాలా సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తిని కూడా చూడవచ్చు. ఓరినాయనో ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా..! ఇది హర్రర్‌ స్టోరీకి ఏమాత్రం తీసిపోదు.

ఇక్కడ దెయ్యాల గురించి చాలా కథలు ఉన్నాయి. హైవే హాంటింగ్ ఒకటి. అతను 18వ శతాబ్దంలో మరణించాడు. చెట్టుకు ఉరివేసుకున్నాడు. నేటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాడట.

అప్పుడప్పుడూ అక్కడ ఓ చోట టీచర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆమె మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరణించింది. సెయింట్ నికోలస్ చర్చిలో 1100లో ఒక మహిళ మరణించింది. ఆమెను రెడ్ లేడీ అని పిలుస్తారు. ఆమె తరచుగా ప్రజలకు కనిపిస్తుంది. ఇక్కడ నివసించడం సులభం కాదు. ప్రస్తుతం ఈ గ్రామంలో వెయ్యి మంది నివసిస్తున్నారు. రాత్రికి ముందు కూడా ఇక్కడ కొందరి ఏడుపు, నవ్వుల శబ్దాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ప్లక్లీ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రస్తుతం ఇది పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. చర్చిలు, పాఠశాలలు, రెస్టారెంట్లు మరియు అనేక దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. ఈ గ్రామం చాలా అందంగా ఉంది. ఈ గ్రామ చరిత్ర చాలా పురాతనమైనది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది సైనికులు ఇక్కడ నివసించారు. మరణించిన తర్వాత ఈ సైనికులు తమ కుటుంబాలను సందర్శించేందుకు దెయ్యాలుగా ఇక్కడికి వచ్చారని, తిరిగి రాలేదని చెబుతారు. మనిషి దెయ్యమే కాదు.. దెయ్యంగా వీధుల్లో తిరుగుతున్న కుక్కను కూడా చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news