తన వెంటపడి వేధిస్తున్న యువకుడికి నిప్పంటించిన బాలిక

-

తన వెంట పడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. అని బెదిరిస్తున్నాడు. 15 ఏళ్ల బాలికను రోజూ హింసిస్తున్నాడు 20 ఏళ్ల యువకుడు. దీంతో ఆ యువకుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది ఆ బాలిక.

దీంతో ఓ రోజు ఇలాగే పెళ్లి చేసుకోవాలని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. తనపై పెట్రోల్ పోసుకున్నాడు ఆ యువకుడు. తనను బెదిరించాడు. వెంటనే తన అగ్గిపిల్ల గీచి అతడి శరీరానికి మంటలు అంటించింది ఆ బాలిక. దీంతో ఆ యువకుడి శరీరానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకున్నది.

ఈ ఘటనలో ఆ యువకుడి శరీరం 60 శాతం కాలింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ యువకుడి తల్లి… తన కొడుకుపై నిప్పంటించిన బాలిక, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే.. ఆ యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నప్పుడు.. బాలికతో పాటు తన తల్లి కూడా అక్కడే ఉందట. బాలిక అగ్గిపుల్ల గీచి అతడి మీద విసురుతున్నా.. తల్లి ఆపకుండా.. తన కూతురును తీసుకొని అక్కడి నుంచి పారిపోయిందట. దీంతో బాలిక, ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version