హేట్సాఫ్ చిన్నారి.. ఇంగ్లీష్‌లో అదరగొట్టావు.. వీడియో

-

girl student excellent speech in English

ఇంగ్లీష్.. కొంతమందికైతే అదంటేనే వణుకు. ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడితే వీళ్లు భయపడిపోతారు. తెలియకుండానే వాళ్ల చేతులు, కాళ్లు వణికిపోతాయి. ఎందుకలా అంటే.. ఇంగ్లీష్ అంటే వణుకు అంటారు. ఇంగ్లీష్ అంటే ఎందుకు చాలామంది భయపడతారు అనే దాని గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకునేది. ఈ వీడియో చూడండి.. ఆ చిన్నారి ఇంగ్లీష్‌లో స్పీచ్‌ను ఎలా దడదడలాడించిందే. నాకు తెలిసి.. ఆ అమ్మాయి నాలుగో లేదా ఐదో తరగతి చదువుతుండొచ్చు. అది మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో. అక్కడ వసతులు ఎలా ఉంటాయో.. చదువు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ.. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున జెండావందనం తర్వాత స్పీచ్ ఇచ్చి అదరగొట్టింది. సరైన టీచర్లు ఉంటే విద్యార్థులు ఎందుకు ఎదగరు. దానికి నిదర్శనమే ఈ వీడియో. అది ప్రభుత్వ పాఠశాల అయితేనేం.. ఇంటర్నేషన్ స్కూల్ అయితేనేం. కావాల్సిన చొరవ, పట్టుదల, కృషి, ఏదైనా సాధించాలనే కోరిక. ఇవి ఉంటే చాలు.. ఎవరూ నేర్పించకున్నా.. అద్భుతాలు సృష్టించవచ్చు. దానికి ఉదాహరణే ఈ వీడియో.

Read more RELATED
Recommended to you

Latest news