ప్రియా ప్రకాశ్ లిప్ లాక్ రచ్చ..!

-

ప్రియా ప్రకాశ్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. కన్నుకొట్టి ఫేమస్ అయిన వారిలో ప్రియా ప్రకాశ్ ను మించి ఎవరు ఉండరు కావొచ్చు. ఆమె పేల్చిన తూటా కేవలం ఆ సినిమా హీరోనే కాదు యువత మొత్తాన్ని టచ్ చేసింది. అప్పటి నుండి యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది ఈ అమ్మడు. మళయాళం లో వస్తున్న ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తో తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

లవర్స్ డే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఉమర్ లులూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు టీజర్ రిలీజైంది. ఇక ఈ టీజర్ లో హీరో రోషన్ ప్రియ ప్రకాశ్ తో చేసిన లిప్ లాక్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రియా ప్రకాశ్ లిప్ లాక్ హంగామా మళ్లీ రచ్చ చేస్తుంది. టీజర్ టీజర్ కు ప్రియా క్రేజ్ డబుల్ ట్రిపుల్ అవుతుందంటే నమ్మాల్సిందే. మరి టీజర్ లతో సందడి చేస్తున్న లవర్స్ డే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news