కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమ్మాయిల‌కే డిమాండ్

-

స‌మాజంలో పుత్రుడు అయితే పున్నామ న‌ర‌కం నుంచి త‌ప్పిస్తాడ‌న్న నానుడి ఎప్ప‌టి నుంచో ఉంది. కేవ‌లం అబ్బాయే కావాల‌నుకు వాళ్లు అబ్బాయి పుట్ట‌క‌పోతే భార్య‌ల‌ను తీవ్రంగా హిసించే సంఘ‌ట‌న‌లు మ‌నం కోకొల్లుగా చూశాం. ఇక మ‌న‌వ‌డు పుట్ట‌లేద‌ని కోడ‌లిని వేధించే అత్త‌,మామ‌ల‌ను ఎంతోమందిని చూస్తుంటాం. తమ వారసత్వాన్ని నిలబెట్టే మగసంతానం కావాలని త‌ల్లిదండ్రులు, అత్త‌మామ‌లు ఎంతో ఆరాటపడుతారు. తొలి కాన్పు ఆడపిల్ల పుడితే మలికాన్పు మగబిడ్డ కోసం ఎన్నో అబార్షన్లను చేసిన వారిని చూశాం. త‌రాలు మారుతున్నా ఈ ఆలోచ‌న మాత్రం మార‌డం లేదు.


ఇదిలా ఉంటే ఇటీవ‌ల త‌ల్లిదండ్రుల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. కొడుకుల కంటే కంటే కూతుళ్ల‌నే క‌నాల‌న్న ఆలోచ‌న బాగా పెరుగుతోంద‌ట‌. తల్లిదండ్రులపై ప్రేమ కురిపించడంలో ఆడబిడ్డలే ముందుం ఉంటున్నార‌న్నది తాజా స‌ర్వేల్లో ఎక్కువుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. కొడుకులు కావాల‌ని త‌ల్లిదండ్రులు ఎంతో ఆరాట‌ప‌డి వాళ్ల‌ను క‌ని పెంచి పెద్ద చేస్తే కొడుకులు పెళ్లాల మాట విని కన్నతల్లిదండ్రులను వదిలేస్తున్నారు. వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు… మ‌రికొంద‌రు ఏకంగా వృద్ధాశ్ర‌మాల్లో చేర్పిస్తున్నారు.

క‌ట్ చేస్తే సంతానం లేని వాళ్ల విష‌యంలో మాత్రం సీన్ రివ‌ర్స్‌లో జ‌రుగుతోంది. కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా ఇప్పుడు దత్తత విషయంలో అమ్మాయిలనే ఎంపిక చేసుకుంటుండడం విశేషం. ఇటీవ‌ల ఈ ట్రెండ్ ఎక్కువ అవుతోంది. వృద్ధాప్యంలో ఉన్న‌ప్పుడు తల్లిదండ్రుల‌ను చూసుకునే విష‌యంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందు ఉంటున్నార‌ట‌.

కేంద్రం ప్రభుత్వం పెట్టిన దత్తత వెబ్ సైట్ లో 90శాతం మంది తమకు అమ్మాయిలే దత్తత తీసుకోవడానికి కావాలని పేర్కొనడం విశేషం. ఇక ఏపీలోని రాజ‌ధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శిశుగృహల్లో కూడా అమ్మాయిలనే 90శాతం మంది దత్తత తీసుకోవడం విశేషంగా మారింది

Read more RELATED
Recommended to you

Exit mobile version