ఇవాళ భారతదేశమంతా 70 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రత్యేకంగా డూడుల్ ను తయారు చేసింది. 26 జనవరి 1950 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం భారతీయులు భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్(1935) అమలులో ఉండేది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించి.. దాన్ని 1950 జనవరి 26 నుంచి అమలు చేసుకుంటున్నాం. ఈసందర్భంగా గూగుల్.. స్పెషల్ డూడుల్ తో రిపబ్లిక్ డేను సెలబ్రేట్ చేసింది.