కుక్కర్ మాడిపోయిందా..? అయితే ఇలా శుభ్రం చేసుకోండి..!

-

ఒక్కొక్క సారి ప్రెషర్ కుక్కర్ పాడవడం వలన కూతలు రావు. దాంతో కుక్కర్ మాడిపోతుంది. కుక్కర్ మాడిపోతే క్లీన్ చేసుకోవడం పెద్ద సమస్య. ఆ మరకలు అన్నీ కూడా ఉండిపోతాయి. కుక్కర్ కాలిపోతే ఆ భాగం అంతా కూడా పాడవుతుంది చూడడానికి అసహ్యంగా కనబడుతుంది అయితే ఇటువంటి కుక్కర్ ని కనుక క్లీన్ చేయాలంటే ఈసారి ఇబ్బంది పడకండి. ఇలా ఈజీగా మనం కుక్కర్ ని క్లీన్ చేసుకోవచ్చు.

కుక్కర్ని శుభ్రం చేయడానికి వెనిగర్ నిమ్మకాయ బాగా ఉపయోగపడతాయి వెనిగర్ నిమ్మరసం మురికిని సులభంగా తొలగిస్తాయి నల్లబడిన ప్రెషర్ కుక్కర్ ని కొత్త దానిలా మెరిసేటట్టు వెనిగర్ చేస్తుంది. కుక్కర్లో కొంచెం వెనిగర్ వేసుకోండి అందులో కొంచెం నిమ్మరసం వేసుకోండి కొంచెం నీళ్లు పోసి 20 నిమిషాల పాటు అదే విధంగా వదిలేయండి ఇప్పుడు శుభ్రమైన క్లాత్ పెట్టి తుడవండి. కుక్కర్ బాగా క్లీన్ అయిపోతుంది.

ఉల్లిపాయ రసం కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది. జిడ్డు ని తొలగించడంతో పాటుగా మరకల్ని కూడా వదులుస్తుంది. నాలుగైదు చెంచాలు మీరు ఉల్లిరసం వేసుకొని ఎంత ఉల్లి రసం అయితే వేసారో అంత వెనిగర్ ని వేయండి ఇలా కుక్కర్ని క్లీన్ చేసుకుంటే జిడ్డు పోతుంది. మరకలు అన్నీ కూడా పోతాయి. డిష్ వాషర్ ని ప్రెషర్ కుక్కర్ లో వేస్తే కూడా మరకలు పోతాయి డిష్ వాష్ కొంచెం వేసి నిమ్మరసం కూడా వేసి కుక్కర్ ని క్లీన్ చేయండి ఇక కుక్కర్ మెరిసిపోతుంది కొత్త దానిలా వచ్చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news