ఈ మధ్య జనాలకు సోషల్ మీడియా పిచ్చి బాగా ఎక్కేసింది. ఏదో ఒక తీట పని చేసి ఫేమస్ అవ్వాలి, తన వీడియోకు లైక్స్, వ్యూస్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. మొన్నటికిమొన్న మెట్రోలో బ్రష్ చేశాడు ఒకడు, ఇంకో వ్యక్తి అయితే ఏకంగా స్నానమే చేశాడు. అంతే కాదు.. మీరు చూసే ఉంటారు.. ఎండ వేడికి తట్టుకోలేక ఇలా చేస్తున్నాడు అంటూ..స్కూటీలపై బకెట్‌లో నీళ్లు తీసుకోని రోడ్డుపై వెళ్లూ తలపై పోసుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలకు సోషల్ మీడియాలో బాగానే వ్యూస్ వస్తుండటంతో ఒకరి తర్వాత మరొకరు ఈ ట్రెండ్ ఫాలో అవుతూ రీల్స్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్ చేస్తున్నామని చెబుతూ అక్కడి వ్యక్తులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. అలాంటి ‘బాతింగ్ ఆన్ రోడ్’ వీడియో చేసిన ఓ వ్యక్తికి తమిళనాడు పోలీసులు ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Youth from Vellode, took a bath in a public place in Erode on Sunday with the intention of posting a video on Instagram and getting likes. Erode town Police fined him on Monday for acting as a wrong guide to the younger generation.@NewIndianXpress @mannar_mannan @Senthil_TNIE pic.twitter.com/N8Y2QfjXJY
— Srinivasan Perumal (@ShrinJournalist) May 29, 2023
రూ.10 బెట్ కోసం రూ.3500 ఫైన్
తమిళనాడులోని ఈరోడ్ లో ఎం ఫరూక్ (24) అనే యువకుడు నడి రోడ్డుపై స్నానం చేయడంతో తమిళనాడు పోలీసులు అతనికి ఫైన్ వేశారు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఎం. ఫరూక్ ఇన్ స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. పచ్చి చేపలను తినడం, చక్కెరకు బదులు ఉప్పు వేసిన టీ తాగడం, రోడ్లపై నిద్రపోవడం లాంటివి చేసి తన ఫాలోవర్స్ విసిరే ఛాలెంజెస్ చేస్తుంటాడు. తాజాగా రూ. 10 బెట్టింగ్ కోసం నడిరోడ్డుపై స్నానం చేసేందుకు సిద్ధమయ్యాడు. నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే ఈరోడ్ లోని పన్నీర్ సెల్వం పార్క్ జంక్షన్ వద్దకు స్కూటీపై వచ్చాడు. వెంట బకెట్‌లో నీళ్లు తెచ్చుకున్నాడు. సిగ్నల్ పడగానే స్నానం చేయడం మొదలు పెట్టాడు. ఇదంతా తనతో పాటు వచ్చిన వారు వీడియో తీశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. తోటి వాహనాదారులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎం ఫరూక్‌ను గుర్తించి తనపై రూ.3,500 ఫైన్ వేశారు. ఇక ఇలాంటి ట్రెండ్ ఫాలో అయ్యేవారు జర పైలం.!