‘హార్ట్‌ ఎటాక్ రెస్టారెంట్‌’ కష్టమర్లే రోగులు.. డాక్టర్లుగా వెయిటర్లు..!

-

హార్ట్‌ ఎటాక్ రెస్టారెంట్‌: కష్టమర్లను ఎట్రాక్ట్‌ చేసుకోవడానికి వారి బిజినెస్‌కు వెరైటీ పేర్లను పెట్టుకోవడం మనం చూసే ఉంటాం.. కానీ పిచ్చి మరీ ఇంత పీక్స్‌లోకి వెళ్లడం మీరు అస్సలు చూసి ఉండరు.. ఆ రెస్టారెంట్‌ పేరు హార్ట్‌ ఎటాక్‌ రెస్టారెంట్. అంటే ఆ రెస్టారెంట్‌లోకి వెళ్తే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా అని మీరు అనుకోవచ్చు.. అక్కడి ఫుడ్‌ ఐటమ్స్‌ తింటే నిజంగానే వస్తుంది. ఇంకా హెలెట్‌ ఏంటంటే.. అసలు రెస్టారెంట్లు అంటే.. లోపలికి వెళ్లగానే చాలా పీస్‌ ఫుల్‌గా డిమ్‌ లైట్‌తో ఉంటాయి.. కానీ ఇక్కడ అలా కాదు.. మీరు ఈ రెస్టారెంట్‌లోకి వెళ్తే.. ఒక ఆసుపత్రిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. సర్వ్‌ చేసేవాళ్లు నర్సుల్లా డ్రస్‌ వేసుకుంటారు..!

అమెరికాలోని (America) లాస్‌ వెగాస్‌లో ‘హార్ట్‌ ఎటాక్‌ గ్రిల్ రెస్టారెంట్‌’ను స్థాపించారు. జంక్‌ఫుడ్‌ ప్రియులంతా హ్యామ్‌ బర్గర్‌ను లొట్టలేసుకుంటూ తింటారు. అయితే ‘హార్ట్‌ ఎటాక్‌ గ్రిల్ రెస్టారెంట్‌’లో దొరికే హ్యామ్‌బర్గర్‌ తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. శరీరంలోకి వెళ్లిన ఆ క్యాలరీలన్నీ కొవ్వుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కేవలం బర్గర్‌లు మాత్రమే కాదు ఇక్కడ ప్రతిదీ అతిగానే ఉంటుంది. ఒక్క వ్యక్తి తినే స్థాయిలో ఏ ఐటమ్‌ ఉండదు. అందుకే ఈ రెస్టారెంట్‌ను మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక లొల్లి అవుతూనే ఉంది..

‘హార్ట్‌ ఎటాక్‌ గ్రిల్ రెస్టారెంట్‌’ను జాన్‌ బాసో అనే వ్యక్తి 2005లో ప్రారంభించాడు. అందులోకి అడుగుపెట్టగానే హాస్పటల్‌కు వచ్చినట్లు అనిపిస్తుంది.. ఎందుకంటే ఇక్కడకు వచ్చే ఆహార ప్రియులను కస్టమర్లుగా కాకుండా ‘రోగులు’ అని సంబోధిస్తారు. అంతేకాదండోయ్‌ ఆ రోగులకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఓ గౌను కూడా తొడుగుతారు. ఇక్కడ పని చేసే వెయిట్రస్‌లను నర్సులని, వెయిటర్లను డాక్టర్లని పిలుస్తారు. ఇక కస్టమర్‌ ఇచ్చే ఆర్డర్‌ను ‘ప్రిస్క్రిప్షన్‌’ అంటారు. అసలు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్లాలని అనుకోరు.. అలాంటిది.. ఈ రెస్టారెంట్‌ను ఇలా ఆసుపత్రిలా ఎందుకు మార్చారో కదా..!

ఇక్కడ హ్యామ్‌బర్గర్లే కాకుండా బైపాస్‌ బర్గర్‌లు చాలా ఫేమస్‌. బైపాస్‌ బర్గర్‌ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుతూ పోతారు. ఇవే కాకుండా ఫ్లాట్‌లైనర్‌ ఫ్రైస్‌, కరోనరీ డాగ్‌, మద్యం, బటర్‌ ఫ్యాట్ మిల్క్‌షేక్‌, ఫుల్‌ షుగర్‌ కోలా, చిన్నారుల కోసం క్యాండీ సిగరెట్స్‌ దొరుకుతాయి. ఇవన్నీ ఆర్డర్‌ చేశాక పూర్తిగా తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సుల్లో ఒకరు రోగులను సరదాగా బెల్టు లేదా తెడ్డుతో కొడతారు. పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా.. ఈ రెస్టారెంట్‌ మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వారికి తిన్నంత ఫుడ్‌ను ఉచితంగా పెడతారు.

మొదటి నుంచే పంచాయితీలు..

కస్టమర్ల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని ఈ రెస్టారెంట్‌ ప్రోత్సహిస్తోందని పలువురు విమర్శించారు. దాంతో ఈ రెస్టారెంట్ పేరు తరచూ వార్తలకు ఎక్కుతుంది.. వీరు తయారు చేసిన భారీ క్యాలరీలతో కూడిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యం బారిన పడిన వారు అనేక మంది ఉన్నారు. అయినా, అటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడం మానలేదు. ఇక్కడ తినడం వల్ల హాని జరుగుతోందని తెలిసినా వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం విశేషం.. అంటే జనాలకు ఆరోగ్యం మీద ఎంత మేర శ్రద్ధ ఉందో మీరే ఆలోచించండి..!

Read more RELATED
Recommended to you

Latest news