ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అభ్యంతరాల మధ్య ఎట్టకేలకు కర్ణాటక కేబినెట్ కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఇవాళ కొలువుదీరింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కొత్తగా ఎన్నికైన 24 మంది శాసనసభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా మంత్రివర్గ విస్తరణతో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలుపుకొని కేబినట్లో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరేగౌడ, ఎన్.చెలువరాయస్వామి, కే.వెంకటేశ్, హెచ్‌సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు క్యాతసాండ్ర ఎన్.రాజన్న, శరణబసప్ప దర్శనాపుర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపుర్, ఎస్.ఎస్.మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, శరణప్రకాష్ రుద్రప్ప పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్, రహీం ఖాన్, డీ.సుధాకర్, సురేశ్ లడ్జులు, సంతోష్, బీ.ఎస్.మధు బంగారప్ప, ఎమ్.సీ. సుధాకర్, బీ.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మంకుల్ వైద్య, ఎమ్.సీ.సుధాకర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.